ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu

0
3505

tips for allergy in Ayurveda

  • ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu

Ayurveda tips for allergy

  • ఎలర్జీ చాలా మందికి చిరపరిచయమైన పదం. ప్రతి పదిమందిలోనూ కనీసం ఇద్దరికి ఏదో ఒక రూపంలో ఎలర్జీలు బాధిస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి.
  • దీర్ఘకాలంపాటు బాధించే ఎలర్జీలకు శాశ్వత పరిష్కారం కోసం బాధితులు అన్వేషిస్తుంటారు. అటువంటి వారికి ఆయుర్వేదం ఎలా రక్షిస్తుందో చూడండి.

వ్యాధి రక్షణ శక్తి తగ్గటం, కాలుష్యాలు పెరగటం అనే రెండు ముఖ్యమైన అంశాల కారణంగా ఎలర్జీలు బలపడి మొండిగా తయారవుతాయి.

బలవంతంగా అణిచిన కొద్దీ ఎలర్జీలు ఏదో ఒక రూపంలో బహిర్గతమవుతూనే ఉంటాయి. కారణాన్ని కనిపెట్టి మూలానికి వెళ్లి చికిత్స చేయడమొక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఆయుర్వేదం ఈ దిశగా పనిచే స్తుంది.

వ్యాధి వ్యవస్థ ప్రతిస్పందన అసాధారణంగా పెరగడాన్ని ఎలర్జీగా చెప్పవచ్చు. వాతావరణంలోని ఎలర్జీ కారకమైన ‘ఎలర్జన్‘కి వ్యతిరేకంగా శరీరం మితిమీరి ప్రవర్తించినప్పుడు ఎలర్జీ పుడుతుంది.

మామూలు సందర్భాల్లో మామూలు వ్యక్తుల్లో ఏ రకమైన చర్యా కలిగించని కొన్ని పదార్ధాలను కొంతమంది శరీరం హానికరమైనవిగా భ్రమపుడుతుంది.

ప్రతి చర్యగా అనేక లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ లక్షణ సముదాయమే ఎలర్జీ. ఆయుర్వేదంలో ఎలర్జీ లక్షణాలకు సంబంధించిన వివరణ పీనసం,ఉదర్ధం,కోఠరం, కండూ తదితర పదాలతో కనిపిస్తుంది.

Next

4. ఆయుర్వేద చికిత్స

ఎలర్జీలకు ఆయుర్వేద చికిత్సలు తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా క్రైసిస్ మేనేజ్ మెంట్), శాశ్వత ప్రాతిపదికన (హెల్త్ మేనేజ్మంట్) పనిచేస్తాయి.

ఎలస్టీలో ఏర్పడే దద్దుర్ల గురించి ఆయుర్వేదం వివరణ ఇస్తూ త్రిదోషాలలో వాతం ఎక్కువగా ఉంటే శీతపిత్తంగానూ, కఫం బలీయంగా ఉంటే ఉదర్గంగానూ భావించాలని చెప్పింది.

ఇవే కాకుండా పీనసం వంటి శ్వాసకోశసంబంధ స్థితిగతులను కూడా పరిగడిస్తూ చికిత్స రూపొందించాలి. ఎలర్జీలో శరీరాన్ని మార్దవంగా చేయటం కోసం స్నేహకర్మను, చెమటను పుట్టించడానికి స్వేదకర్మను చేయాలి.

దీనికి కొనసాగింపుగా చేదుపొట్ల, వేప, అడ్డనరం మొదలైన మూలికలతో వమనాన్ని, త్రిఫలా కషాయంతో విరేచనాన్నిచేయించాలి.

శరీరాన్ని శుద్ది చేస్తాయి. కనుక వీటిని శోధన చికిత్స అంటారు. ఈ శోధన చికిత్సలతో ఎలర్జీలకు ప్రధాన హేతువులైన కఫ, పిత్తాలు నిశ్శేషంగా నిర్హరించపబడతాయి.

అవనూనెలో అభ్యంగనం చేయించి, వేడినీళ్ళతో స్నానం చేయడంతో సంశోధన చికిత్సలు పూర్తవుతాయి. ఉపశమనం కోసం శమన చికిత్సలు తోడ్పడతాయి.

ఎలర్జీలో శీతపిత్తభంజనీరస, త్రిభువనకీర్తి రస, మహాసుదర్శన చూర్ణం వంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయి. వీటిని అవస్థానుసారం వైద్యసలహా మేరకు వాడితే ఎలర్జీని శాశ్వతంగా అదుపులో ఉంచుకోవచ్చు.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్,
హైదరాబాద్

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here