- ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu
Ayurveda tips for allergy
- ఎలర్జీ చాలా మందికి చిరపరిచయమైన పదం. ప్రతి పదిమందిలోనూ కనీసం ఇద్దరికి ఏదో ఒక రూపంలో ఎలర్జీలు బాధిస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి.
- దీర్ఘకాలంపాటు బాధించే ఎలర్జీలకు శాశ్వత పరిష్కారం కోసం బాధితులు అన్వేషిస్తుంటారు. అటువంటి వారికి ఆయుర్వేదం ఎలా రక్షిస్తుందో చూడండి.
వ్యాధి రక్షణ శక్తి తగ్గటం, కాలుష్యాలు పెరగటం అనే రెండు ముఖ్యమైన అంశాల కారణంగా ఎలర్జీలు బలపడి మొండిగా తయారవుతాయి.
బలవంతంగా అణిచిన కొద్దీ ఎలర్జీలు ఏదో ఒక రూపంలో బహిర్గతమవుతూనే ఉంటాయి. కారణాన్ని కనిపెట్టి మూలానికి వెళ్లి చికిత్స చేయడమొక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఆయుర్వేదం ఈ దిశగా పనిచే స్తుంది.
వ్యాధి వ్యవస్థ ప్రతిస్పందన అసాధారణంగా పెరగడాన్ని ఎలర్జీగా చెప్పవచ్చు. వాతావరణంలోని ఎలర్జీ కారకమైన ‘ఎలర్జన్‘కి వ్యతిరేకంగా శరీరం మితిమీరి ప్రవర్తించినప్పుడు ఎలర్జీ పుడుతుంది.
మామూలు సందర్భాల్లో మామూలు వ్యక్తుల్లో ఏ రకమైన చర్యా కలిగించని కొన్ని పదార్ధాలను కొంతమంది శరీరం హానికరమైనవిగా భ్రమపుడుతుంది.
ప్రతి చర్యగా అనేక లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ లక్షణ సముదాయమే ఎలర్జీ. ఆయుర్వేదంలో ఎలర్జీ లక్షణాలకు సంబంధించిన వివరణ పీనసం,ఉదర్ధం,కోఠరం, కండూ తదితర పదాలతో కనిపిస్తుంది.
3. ఎలర్జీలకు, సాధారణ జలుబుకు భేదాలు:
ఎలర్జీలోనూ, సాధారణ జలుబు లోనూ తుమ్ములు, ముక్కుదిబ్బడ, ముక్కు కారటం, కళ్ళు నీరుకారటం, నీరసం, తల నొప్పి ఉంటాయి.
అయితే జలుబులో ఒకదాని తరువాత మరోటి వస్తాయి. ఎలర్జీలో అన్నీ ఒకేసారి చుట్టుముడతాయి.
జలుబు వల్ల ఏర్పడిన లక్షణాలు వారం పది రోజులకు తగ్గిపోతే ఎలర్జీవల్ల ఏర్పడిన లక్షణాలు ఎలర్జీ కారక పదార్థం తొలగనంతవరకూ కొనసాగు తూనే ఉంటాయి.
అలాగే వ్యాధి రక్షణ శక్తి పెరగనంత వరకూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.
సాధారణ జలుబు ముదిరితే ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి పసుపురంగు స్రావాలు వెలువడే అవకాశం ఉంది.
ఎలర్జీలో నీరు లాంటి స్రావం కారుతుంది తప్పితే చిక్కబడదు. పసుపు రంగులోకి మారదు.
జలుబు లక్షణాలు చలికాలంలో ఉధృతంగా ఉంటే ఎలర్జీ లక్షణాలు పుప్పొడి విడుదలయ్యే రోజుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
అలాగే జలుబులో జ్వరం కనిపిస్తే ఎలర్జీలో సాధారణంగా జ్వరం కనిపించదు.