
Aparajita Puja in Telugu
1. అపరాజితాదేవి పూజ
అపరాజితాదేవి శక్తి రూపాలలో ఒకటి. అపరాజిత అంటే ఓడించడానికి అసాధ్యమైనది అని. అపరాజితాదేవి దేవ దానవ యుద్ధం లో సైన్యాధికారిణి. మహిషాసుర మర్దిని స్వరూపమైన ఆమెను పూజించినవారు సర్వత్రా విజయాలను పొందుతారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు, పాండవులు కురుక్షేత్ర సంగ్రామ విజయం కొరకు అపరాజితా దేవిని పూజించారు. ఆమె శమీ వృక్షం(జమ్మి చెట్టు) లో ఉంటుందని భక్తుల విశ్వాసం.
పూజావిధి
నవమి నాడుగానీ నవమి పాక్షికంగా ఉన్న దశమి నాడుగానీ అపరాజితాదేవి పూజకు శ్రేష్టమైన తిథి. ఆ తిథి నాడు సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు, స్నానాదికాలు ముగించుకుని, యథావిధిగా నిత్య పూజను చేయాలి. అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం నుండీ పొద్దువాలే మధ్యకాలం లో అపరాజితా పూజను చేయాలి. షోడశోపచార పూజ చేసి,అపరాజితా స్తోత్రాన్ని పఠించాలి. శమీవృక్షాన్ని పూజించాలి.
అపరాజితా పూజను చేయడం వలన శత్రుబాధలు తొలగుతాయి. సర్వత్ర విజయం లభిస్తుంది.
Related Stories:
Puja Harathi | హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.
గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది | Pregnant Women Perform Puja
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పూజ సమయాలు | Sabarimala Ayyappa Temple Puja Timing
పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules