
What is the Relation between Cow and marriage
1. ఆవు కీ అనుకున్న పనులు నెరవేరడానికీ, పెళ్ళికీ సంబంధం ఏమిటి?
ఆవుని పూజించడం వలన అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. వివాహం శీఘ్రంగా జరుగుతుంది. అయితే సాధారణంగా గోపూజ చేసే విధానానికీ కార్య సిద్ధి కొరకు, వివాహం కొరకు చేసే గోపూజకూ కొంత భేదం ఉంది.
అనుకున్న పనులు నెరవేరడానికీ, వివాహానికీ ప్రత్యేకమైన గోపూజ ఎలా చేయాలి ?
గోవుకు నమస్కరించి, కాళ్ళనూ, తోకను కడిగి, పసుపు కుంకుమలతో ఆవుని అలంకరించాలి. గోమాతని మన ఇష్టదైవంగా భావించి ఉపచారాలతో పూజించాలి. నవధాన్యాలను తీసుకోవాలి. నవధాన్యాలలో వడ్ల బదులుగా గోధుమలను వాడాలి. వాటిని కొద్దిగా నేతితో కలిపి ఆవుకు ఆహారంగా అందించాలి. అదే గోమాతలోని మన ఇష్టదైవానికి నైవేద్యంగా భావించాలి. ఆవు నవధాన్యాలను తినే సమయం లో సరిపడినన్ని నీటిని కూడా అందించాలి. ఆ సమయం లో గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా పదకొండు రోజులపాటు చేయడం వలన వివాహం శీఘ్రంగా జరుగుతుంది. అనుకున్న పనులన్నీ త్వరగా నెరవేరుతాయి.
గోపూజనే ఎందుకు?
గోమాత సర్వ దేవతా స్వరూపం. అందువల్ల ఆవు పాదాలనూ, తోక భాగాన్నీ శుద్ధి చేసి ఉపచారాలు చేయడం వల్ల దేవతలు సంతుష్టి చెందుతారు. నవధాన్యాలను నైవేద్యంగా పెట్టడం వలన గ్రహ దోషాలు తొలగుతాయి. గోవులో పితృదేవతలు కూడా ఉంటారు. గోవుకి నివేదన చేసిన నవధాన్యాల లోని నువ్వులు పితృ దేవతలను సంతృప్తి పరుస్తాయి. పితృదేవతలను సంతుష్టి పరచడం వలన వంశపారంపర్యమైన సర్ప దోషాలు మొదలైనవీ, పితృకర్మలు చేయని దోషాలూ తొలగుతాయి. అందువలన గోపూజ వలన సకల దోషాలూ తొలగి శుభం జరుగుతుంది.
Related Posts
What to feed cows? | గోమాత కి ఏ ఆహారం పెడితే ఏ ఫలితం లభిస్తుంది?
ఆవు పాల తో ఏ ఏ వ్యాధులను ఎదుర్కోవచ్చు? | Prevention of Various Diseases With Cow Milk Telugu
ఆవు నెయ్యి లోఉన్న ఆరోగ్య రహస్యం | Benifits of Cow Ghee in Telugu
ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja in Telugu