How To Celebrate Ugadi | ఉగాది సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి?

0
5600
How To Celebrate Ugadi
How To Celebrate Ugadi in Traditional Way in Telugu

How To Celebrate Ugadi in Traditional Way?

Back

1. ఉగాది ప్రత్యేకత (Importance of Ugadi)

యుగ- ఆది అనే పదాలనుండీ ఉగాది వచ్చింది. కాలం లోని స్పష్టమైన మార్పును ఈ రోజునుండీ గమనిస్తాం.

పాశ్చాత్యుల గ్రెగోరియన్ కాలెండరుకు అలవాటు పడ్డా ఇంకా మన తెలుగు తిథులు, నెలలు, సంవత్సరాలు మరుగున పడకుండా చరిత్రను, భవిష్యత్తును ఏకకాలం లో కాపాడుతున్నాయి మన హిందూ పండగలు.

వాటిలో ఉగాది తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఉగాది పండుగను తెలుగువారూ కన్నడిగులూ కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఒక కొత్త కాలానికి నాందే ఈ ఉగాది పండుగ. శాలివాహన శకం ద్వారా మన తెలుగు సంవత్సరాలను లెక్కిస్తారు. అసలు ఈ ఉగాది ని ఎవరు నిర్ణయించారో తెలుసుకుందాం.

ఉగాది ఎలా ప్రారంభమైంది? (How Ugadi Started?)

మన ప్రాచీన ఖగోళ శాస్త్ర పండితుడైన భాస్కరాచార్యుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది ఆరంభాన్ని  గుర్తించారు.

ఆ రోజుకు ఒక ఆవృత్తం అంటే  ఒక సంవత్సర కాలం సరిగ్గా పూర్తి అవుతుందనీ, ఆ రోజునుండీ వసంత ఋతువుతో  కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందనీ ఆ మహా పండితుడు వివరించాడు. ఇది ప్రపంచమంతా నిరూపితమైంది కూడా.

మన తెలుగువారి శాలివాహన శకం  ప్రకారం ఇది ఎన్నో సంవత్సరం ?

ఇది కలియుగం లో 5117 వ సంవత్సరం. శాలివాహన శకం ప్రకారం 1938 వ సంవత్సరం.

మన తెలుగు సంవత్సరాలలో ముప్పై ఏడు శోభకృతు సంవత్సరం నేటితో ప్రారంభమైంది. ఉత్తరాయణం వసంత రుతువు. చైత్ర మాస శుక్ల పక్షం, పాడ్యమి తిథి.

సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి? (How to Celebrate Ugadi Traditionally?)

కొత్త సంవత్సరం ఎన్నో కొత్త ప్రణాళికలకూ, కొత్త ఆశయాలకూ, కొత్త కొత్త  ఆశలకూ నాంది. ఈ పండగనాడు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొంటారు.

సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి.  గుమ్మాలను మామిడాకులతో అలంకరించుకోవాలి. ముంగిళ్లు ముగ్గులతోనూ, గడపలు పసుపు కుంకుమలతోనూ మహాలక్ష్మిలా దిద్దుకోవాలి.

ఇష్టదైవాన్ని మనసారా ఆరాధించి రకరకాల పిండివంటల తో పాయసాన్నాలతో పండగ వంట చేసి నివేదించాలి.

షడ్రుచుల సమ్మేళనమైన(తీపి, పులుపు, చేదు,కారం, వగరు,ఉప్పు) ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతునికి నివేదించి ఇంటిల్లిపాదీ స్వీకరించాలి.

జీవితం ఎన్నో భావోద్వేగాల సంకేతమని ఉగాది పచ్చడి చెబుతుంది. సాయంత్రం పంచాంగ శ్రవణం మన ఉగాది పండుగ లోని ముఖ్యమైన ఘట్టం.

ఉగాది నాడు సంతోషంగా ఉంటే ఆ సంవత్సరమంతా సంతోషంగా ఉంటుందని మన తెలుగువారి నమ్మకం. అందుకనే ఉగాది నాడు తప్పనిసరిగా బంధువులనూ, దేవాలయానూ దర్శించుకుని ఇంటిల్లిపాదీ ఆనందంగా గడుపుతారు.

శుభం..!

సమస్త ప్రజానీకానికీ ఈ శ్రీ విలంబి నామ సంవత్సరం సకల సౌఖ్యాలనూ ఆయురారోగ్యాలనూ అందించాలని కోరుకుంటున్నాం..

2025 తెలుగు సంవత్సరం పేరు & ఎప్పుడు (What is 2025 Telugu Year Name & When is Starting Date)

తెలుగు నూతన సంవత్సరం పేరు “విశ్వవసు” నామ సంవత్సరం. దీని యొక్క అర్ధం “ధనం సమృద్దిగా ఉండును

ఆదివారం, మార్చి 30, 2025 ఉగాది.

ప్రతిపాద తిథి ప్రారంభం – మార్చి 29, 2025న 16:27
ప్రతిపాద తిథి ముగుస్తుంది – మార్చి 30, 2025న 12:49

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here