Black Magic Remedies | ఎవరైనా మీపై తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తున్నారని సందేహంగా ఉందా? వాటిని తిప్పి కొట్టే మార్గం.

2
57367

 

tantras-use-lemons
Black Magic Remedies in Telugu

Black Magic Remedies

1. మీపై తంత్ర / మంత్ర / క్షుద్ర  ప్రయోగాలు జరుగుతున్నాయని సందేహంగా ఉందా?

చాలామంది ఉన్నట్టుండి  వైద్యపరంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ, మానసిక సమస్యలూ లేకున్నాదీర్ఘ కాలం జబ్బుపడుతూ ఉంటారు. చేయగలిగిన పనులు కూడా చేయలేక ఎందుకు చేయలేక పోతున్నారో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. అకారణంగా, ఏ జబ్బూ లేకుండా  నిరంతరం ఏడుస్తూ, అందరిపైనా అరుస్తూ, తమ పనులు తామే చెడగొట్టుకుంటూ అందరినీ బాధిస్తారు. తమలో తాము కుమిలిపోతుంటారు. అప్పుడు వారిపై తంత్ర ప్రయోగాలేమైనా జరిగి ఉండవచ్చు అనుకోవడానికి ఆస్కారం ఉంది.

క్షుద్ర ప్రయోగాలు లేదా తంత్ర ప్రయోగాలు నిజమేనా?

చాలా మంది తంత్ర ప్రయోగాలను నమ్మరు. నిజానికి నమ్మలేనంత వింత ఏదీ అందులో లేదు. మన మేధాశక్తికి అందనంత మాత్రాన అవన్నీ అబద్ధాలు కాకపోవచ్చు.మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం లోనే ఉన్న ఎన్నో విషయాలు మన పూర్వీకులు క్షుణ్ణంగా ఔపోసనపట్టారు. వాటిలో ఒకటే ఈ క్షుద్ర/తంత్ర ప్రయోగాలు. ప్రకృతిలోని శబ్ద తరంగాలను మంత్రాల ద్వారా ప్రేరేపించి , అందుకు ఉపకరించే వస్తువులనూ ఉపయోగించి ఒక వ్యక్తిపై ప్రభావం కలిగించడం జరుగుతుంది. కానీ చాలామంది వీటిని  ప్రతికూల ప్రభావాలు/చెడు ప్రభావాలు కలిగించడానికే వాడుతున్నారు .  ఒక వ్యక్తి దీవెన మంచి చేయడం ఎంత నిజమో, మనం చేసిన మంచిపనులు మనకు తిరిగి మంచి జరిగేలా చేయడం ఎంత సహజమో ఇవి కూడా అంతే సహజం. మరి ఇటువంటి వాటికి విరుగుడు ఎలా?

క్షుద్ర ప్రయోగాలు లేదా తంత్ర ప్రయోగాలకు, మంత్ర ప్రయోగాలకు విరుగుడు

అత్యంత ప్రమాదకరమైన సమయాలలో సాధారణంగా ఉపాసకులు ఒక్కోరకం ప్రయోగాలకు ఒక్కో దేవతను ఆవాహన చేసుకుని విరుగుడు చేస్తారు. ప్రమాదకరమైన సమయాలలో తప్పకుండా వారినే ఆశ్రయించాలి. ప్రారంభ దశలో ఉన్నప్పుడూ లేదా ప్రభావం అత్యంత ప్రమాదకరంగా లేనపుడూ ఎవరైనా చేయగల కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.

పరిష్కార మార్గాలు

మండలం (41) రోజులపాటు నరసింహ స్వామిని భక్తి పూర్వకంగా పూజించి, నరసింహ స్తోత్రం చదివి నెయ్యి కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఎటువంటి తంత్ర, మంత్ర, క్షుద్ర ప్రయోగాలైనా సమసిపోతాయి. ప్రభావానికి లోనైన వారి చేత ఇలా చేయించడం చాలా మంచిది. కుదరని పక్షం లో ఇంట్లోని వారెవరైనా వారికి బదులుగా పూజ చేసి, ప్రసాదాన్ని ప్రయోగానికి లోనైన వారిచేత తినిపించాలి. క్షుద్ర ప్రయోగాలని భావించే ముందు ఒకసారి మానసిక వైద్యుని కలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతోమంది మానసిక రుగ్మతలను కూడా క్షుద్ర లేదా తంత్ర ప్రయోగాలు అని భావిస్తారు.

Related Posts

Remedies To Get Rid Of Past Life Karma | గత జన్మ పాపాలను ఈ జన్మలో ఎలా తొలగించుకోవచ్చు?

Signs of Evil Eye | ఈ సంకేతాలు ఉంటే మీకు నరదృష్టి ఉన్నట్టే! నివారణ ఇప్పుడే తెలుసుకోండి!

Shani Jayanti 2025 | Why Celebrate Shani Jayanti, Date, Rituals, Significance

కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha

ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

 

Promoted Content

2 COMMENTS

  1. అయ్యా నమస్కారం మంచి పరిశోధన చేసి
    పరిష్కారము లను తెలుపు చున్నారు సేవ్
    చేసేటట్టుకూడ పంప గలరు

  2. Naku alane authundhi aundi na wife valla naku manashanthi ledhu aundhukani naku help cheyandi please na number 9177296857 pls help me

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here