కొత్త అమావాస్య | Kotha Amavasya in Telugu

4
12308
things to do on kotha amavasya
Kotha Amavasya in Telugu

Kotha Amavasya

1కొత్త అమావాస్య

ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఆ రోజుని కొత్త అమావాస్య అంటాం.  చాంద్ర మాన సంవత్సరం లోని చివరి అమావాస్య ఇది. అమావాస్య నాడు చంద్ర కిరణాలు లేని కారణంగా సముద్రం లోని అలలు ఒక నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి.అలాగే మానవశరీరం లోని రక్తప్రసరణ లోనూ మార్పులు వస్తాయి. అందుకే అమావాస్య రోజున మన ఆలోచనలు, ఏకాగ్రత చాలా తీక్షణంగా ఉంటాయి. ఆరోజున చేసే జప తపాలకు విశేష ఫలితాలు ఉంటాయి. ఆరోజు ఉపవసించడం వలన మనసు చెడు ఆలోచనలకు దూరంగా సాత్విక భావనలతో ఉంటుంది. అమావాస్య రోజున  సంకల్పశక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఆరోజున భగవంతుని ధ్యానిస్తే  ఫలితం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఫాల్గుణ అమావాస్య / కొత్త అమావాస్య రోజున చేయవలసిన ముఖ్యమైన పనులు

  1. పితృకార్యాలు

    • పితృదేవతలకు పిండప్రదానం చేయాలి.

    • తర్పణాలు విడవడం ద్వారా పితృదేవతలకు సంతృప్తి కలిగించి, వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు.

    • ఇవి వారిని ఉత్తమ లోకాలకు చేరేలా చేస్తాయి మరియు వంశాభివృద్ధి కలిగిస్తుంది.

  2. దానం చేయడం

    • అమావాస్య రోజున చేయు దానానికి విశేష ఫలితం ఉంటుంది.

    • అన్నదానం, వస్త్రదానం, ద్రవ్య దానాలు చేయడం ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తాయి.

  3. ఉపవాసం

    • ముందురోజు శివరాత్రి ఉపవాసం చేసి జాగరణ చేసిన భక్తులు, అమావాస్య రోజున మధ్యాహ్నం వరకు ఉపవాసాన్ని కొనసాగించాలి.

    • మధ్యాహ్నం తరువాత ఉపవాస దీక్షను విరమించాలి.

  4. ఆపూట ఉపవాసం

    • ఉపవాసం చేయని వారు, అమావాస్య రోజున ఆపూట ఉపవాసం చేసి సాయంత్రం ఉపవాసం విరమించాలి.

  5. ఉపవాస విరమణ పద్ధతి

    • ఉపవాస దీక్షను విరమించే ముందు ఒక అతిథి లేదా ఆకలిగొన్న వారిని ఆహ్వానించి భోజనం పెట్టాలి.

    • వారి పట్ల ఆతిథ్యం అందించిన తరువాత మాత్రమే స్వయంగా భుజించాలి.

    • అప్పుడు ఉపవాస దీక్ష ఫలితంగా సద్ఫలితాలు సిద్ధిస్తాయి.

                                      శుభం భూయాత్..

Chaitra Amavasya 2025 | చైత్ర అమావాస్య యొక్క ప్రాముఖ్యత, చేయవల్సిన పరిహారాలు

4 COMMENTS

  1. గర్బని స్త్రీలు గ్రహణం రోజు కదలకుండ వుండాలి అంటారు నిజమేనా తెలియచెయ్యండి please

    • గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బైటికివెళ్ళడం వల్ల అతినీల లోహిత కిరణాల చెడు ప్రభావం కడుపులోని బిడ్డపై పడే ప్రమాదం ఉంది. అందుకని వారు బైటికి వెళ్లరాదు.ఇంట్లో తిరగడానికి ఎటువంటి అభ్యంతరాలూ లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here