
Story of Gopala Sundari
1. గోపాలసుందరీ దేవి ఎవరు?
శ్రీవిద్యా స్వరూపమైన గోపాలుని రూపమే గోపాల సుందరి. ఆమెనే మదన గోపాల సుందరీ అనీ, శ్రీ విద్యా రాజగోపాల అనీ అంటారు. ఈ రూపం లో సకల సిద్ధిదాత్రి శ్రీవిద్యానూ, జగత్కల్యాణ కారకుడైన శ్రీకృష్ణునీ ఒకే సారి పూజించవచ్చు.
శ్రీ కృష్ణుడి పరమ భక్తుడైన లీలా శుకుడు రచించిన కృష్ణ కర్ణామృతం లో గోపాల సుందరీ ధ్యానం కనబడుతుంది. లీలా శుకుని ధ్యానం లో దర్శనమిచ్చిన అద్భుతరూపమే శ్రీ గోపాలసుందరీ దివ్యమంగళ మూర్తి.
అమ్మవారి రూపం ఎలా ఉంటుంది?
కృష్ణుని రూపం అంకుశ చక్రాలనూ చెరుకు విల్లునూ బంగారు వేణువునూ నెమలి పింఛాన్నీ ధరించి ఉండగా,అమ్మవారి భాగం శంఖాన్నీ, తామర పువ్వునూ, పుష్పా గుచ్చాన్నీ ధరించి ఉంటుంది.
శ్రీవిద్యా రాజగోపాల సుందరీ దేవి జగన్మోహన రూపాన్ని ఎంత చూసినా తనివితీరదు అనడం అతిశయోక్తి కాదు.
శ్రీవిద్యా రాజగోపాల సుందరిని ధ్యానించడం వలన కలిగే విశేష ఫలితాలు ఏమిటి?
గోపాల సుందరీ రూపాన్ని మనసులో ధ్యానిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. మీ మాట ప్రజలకు వేదవాక్యం అవుతుంది. మీరు చేసే ప్రతిపనిలోనూ విజయం సిద్ధిస్తుంది.
ధనానికీ విద్యాకూ, కీర్తిప్రతిష్ఠలకూ కొదవ ఉండదు. ఇహ లోక కామ్యాలన్నీనెరవేరడమే కాక ఆత్మానందాన్నీ ప్రశాంతతనీ పొందుతారు. సాత్వికులకు సాత్వికంగానూ తాంత్రికులకు తాంత్రికంగానూ అమ్మవారి రూపం దర్శనమిస్తుంది.
అమ్మవారిని ఎలా ధ్యానించాలి?
కోదండ మైక్షవ మఖండమీశుం చ పుష్పం చక్రాబ్జ పాశశృణి కాంచన వంశ నాళం |
విభ్రాణమష్ట విధ బాహుభిరర్క వర్ణం ధ్యాయేద్ధరిం మదనగోప విలాస వేషం ||
శ్రీకృష్ణ కర్ణామృతం
సూన బాణంకింతమిక్షు చాపం చక్రాబ్జపాశాంకుశ పంచనాళం |
ధరం కరైరష్టభిరర్కవర్ణం శ్రీకృష్ణ రూపం ప్రణమామి రామం ||
శ్రీ రామ కర్ణామృతం
శ్రీ విద్యా రాజగోపాల సుందరీ దేవి ఆలయం ఎక్కడ ఉంది ?
కర్ణాటక లోని మైసూర్ ప్రాంతం లోగల దక్షిణ కాశీ లో రాజ గోపాల సుందరి ఆలయం ఉంది.