
6 Important Symbols
సింబల్స్ మరియు వాటి యొక్క అర్థాలు
హిందూ మతంలో దేవుళ్ల విగ్రహాలే కాదు, వారి వాహనాలు, ఆయుధాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. దేవుళ్లతోపాటు వాటిని కూడా పూజిస్తారు. అలాగే కొన్ని సింబల్స్ చాలా ప్రత్యేకమైనవి. వీటికి అనేక విశిష్టతలు, అర్థాలు ఉన్నాయి. ఈ చిహ్నాలు మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అవి మనల్ని కాపాడి శక్తిని చూపిస్తాయి, మరికొన్ని దేవుళ్లను మరియు మనం నమ్మే గొప్ప విషయాలను గుర్తు చేస్తాయి. హిందూ మతంలో ప్రసిద్ధి చెందిన 6 సింబల్స్ మరియు వాటి యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓం (Om):
- హిందూ, జైన, బౌద్ధ మతాలలో పవిత్రమైన సింబల్.
- ఇది శబ్దాలన్నిటికీ మూలం, సృష్టి ఆరంభంలో వచ్చిన మొట్టమొదటి ధ్వని.
- “అ”, “ఉ”, “మ” అనే 3 అక్షరాల కలయికగా, ఇవి సృష్టి, స్థితి, లయలను సూచిస్తాయి.
- జపించడం వల్ల మనసుకి శాంతి, ఏకాగ్రత కలుగుతుందని నమ్ముతారు.
శంఖం (Shankha):
- ఆచారాలు, ప్రార్థనల సమయంలో ఉపయోగించే సింబల్.
- శంఖం ఊదడం వేడుకల ప్రారంభం లేదా ముగింపును సూచిస్తుంది.
- దీని యొక్క ధ్వని ఓంను పోలి ఉంటుంది, ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను శుద్ధి చేస్తుంది.
- చెడు, ప్రతికూలతను తరిమికొడుతుందని నమ్ముతారు.
స్వస్తిక్ (Swastika):
- అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం.
- మన హిందూ సంప్రదాయంలో ఇళ్ల ముందు, వాహనాలు మీద, దేవాలయాల్లో దగ్గర గీస్తారు.
- 4 చేతులు మరియు చుక్కలు ఉన్నది, అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం సూచిస్తాయి.
- 4 చేతులు మనస్సు, అంకితభావం, స్పృహ మరియు మోక్షం వంటి విషయాలను సూచిస్తాయి.
త్రిశూలం (Trishula):
- శివుని ఆయుధం, శక్తి, రక్షణకు చిహ్నం.
- మూడు భాగాలు (ప్రాంగ్స్) శివుని గతం, వర్తమానం, భవిష్యత్తుపై నియంత్రణను సూచిస్తాయి.
- చెడు, అజ్ఞానం, బాధలను నాశనం చేసే శక్తిని సూచిస్తుంది.
- ఇడా, పింగళ, సుషుమ్న నాడులను, సత్వ, రజ, తమో గుణాలను, సృష్టి, స్థితి, లయలను సూచిస్తుంది.
వికసించిన తామర పువ్వు (Lotus in Bloom):
- స్వచ్ఛత, కొత్త ఆరంభాలకు చిహ్నం.
- బురద నీటిలో వికసించినా, అందంగా, శుభ్రంగా ఉంటుంది.
- ఆశకు, స్వచ్ఛతకు చిహ్నంగా మారుతుంది.
- యోగ శాస్త్రంలో, సహస్రార చక్రంతో అనుసంధానిస్తారు.
మర్రి చెట్టు (Banyan Tree):
- దీర్ఘాయువు, అమరత్వం, ఆరోగ్యానికి చిహ్నం.
- విస్తారమైన వేళ్లు మానవులు, జంతువులు, దైవం మధ్య సంబంధాన్ని సూచిస్తాయి.
- ఆశ్రయం, రక్షణను అందిస్తుంది, దైవం పాత్రను ప్రజలకు గుర్తు చేస్తుంది.
Related Posts:
మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Sanskrit?
తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు? | How are Decide Telugu Months Names in Telugu?
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.