Ganesh pooja for wealth | సిరి సంపదల కోసం వినాయకుడి పూజ

0
64
good day for ganesh pooja every week
Ganesh pooja on Wednesday for wealth

Ganesh pooja on Wednesday for wealth and happiness

బుధవారం వినాయకుడిని ఇలా పూజించండి:

హిందూమతంలో విఘ్నాల అధిపతి వినాయకుడిని అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు. కనుక, ఆ రోజు గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తారు.

కుటుంబ శ్రేయస్సు కోసం:

కుటుంబ శ్రేయస్సును కాంక్షించే వారు బుధవారం గణపతికి నెయ్యి, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇది పది బుధవారాలు నిర్విరామంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. పూజ అనంతరం ఆ నైవేద్యాన్ని ఆవుకి ఆహారంగా అందించాలి, కానీ కుటుంబ సభ్యులకు ప్రసాదంగా అందించకూడదు. ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.

శాంతి కోసం:

బుధవారం తమలపాకును తీసుకుని గణపతి పూజా స్థలంలో ఉంచి పూజ చేయాలి. ప్రతిరోజు ప్రార్థన సమయంలో పూజించిన తర్వాత, వచ్చే బుధవారం ఆ తమలపాకును ప్రవహించే నదిలో కలపాలి. తర్వాత కొత్త తమలపాకును తీసుకుని మళ్ళీ పూజ చేయడం ప్రారంభించాలి. ఇది ఇంట్లో శాంతి నెలకొల్పుతుంది.

విద్యా వృద్ధికి:

గణపతిని విద్య, జ్ఞానానికి అధిపతిగా పిలుస్తారు. విద్యార్థులు మంచి చదువు, జ్ఞానానికి గణేశుడిని జమ్మి ఆకులతో పూజించాలి. పూజ సమయంలో “ఓం శ్రీ గణేశాయ నమః” మంత్రాన్ని జపించాలి. ఇది విద్యార్థులకి జ్ఞానోదయం కలుగచేస్తుంది.

వృత్తి పరమైన ఎదుగుదల కోసం:

ఉద్యోగ, వ్యాపార సమస్యలతో బాధపడేవారు బుధవారం గణపతి పూజలో దర్భ గడ్డిని పసుపులో ముంచి, వినాయకుడికి సమర్పించి “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని జపించాలి. ఇది వృత్తి పరంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

సంపద, డబ్బు కోసం:

ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమతో స్వస్తిక చిహ్నాన్ని వేయండి. గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు సమర్పించండి. ఏదైనా దేవాలయంలో రెండు అరటి మొక్కలను నాటాలి. అదనంగా, గణపతికి అరటిపండ్లను సమర్పించడం ద్వారా డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

బుధవారం వినాయకుడిని భక్తి, శ్రద్ధలతో పూజించడం ద్వారా సిరిసంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి.

Related posts

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati