
This Shiva temple has boiling water even in freezing cold!
1సైన్స్‌కు సవాల్ ఈ శివాలయం గడ్డకట్టే చలిలో కూడా మరిగే నీరు
ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?
భారతదేశంలో శాస్త్రవేత్తలకూ, మానవ మేధస్సుకూ సవాల్ చేసే అనేక రహస్య ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణలో ఉన్న శివాలయం. ఈ ఆలయం విశేషం ఏమిటంటే, చలికాలంలో కూడా ఇక్కడ నీరు మరుగుతూనే ఉంటుంది. ఈ రహస్యం నేటికీ శాస్త్రవేత్తలకు పరిష్కరించలేనిదిగా మిగిలిపోయింది. ఇది హిందూ మరియు సిక్కు మతాలకు చెందిన చారిత్రాత్మక క్షేత్రం. పార్వతి నది ఇక్కడి గుండా ప్రవహిస్తుంది. నది ఒడ్డున ఒకవైపు శివాలయం, మరొకవైపు గురు నానక్‌కు అంకితమైన చారిత్రాత్మక మణికర్ణ్ సాహిబ్ గురుద్వారా ఉంది. ఇక్కడ వెలువడే వేడి నీటి బుగ్గలు ఇప్పటికీ అద్భుత రహస్యం.ఇప్పుడు ఈ ఆలయం కథ, విశిష్టత గురించి తెలుసుకుందాం.
పురాణ కథ ఏమిటి?
పురాణ ప్రకారం, శివుడు, పార్వతీ దేవి మణికర్ణ వద్ద నివాసం ఉంటున్నారు. ఒకసారి నదిలో ఆడుకుంటున్న పార్వతీ దేవి చెవిపోగు ముత్యం నీటిలో పడిపోయింది. శివుని గణాలు ఎంతో వెతికినా ఆ ముత్యం దొరకలేదు. శివుడు ఆగ్రహించి తన మూడో కన్ను తెరిచాడు. ఆ కోపం కారణంగా నది నీరు మరుగడం ప్రారంభమైంది. ఆ సమయంలో దేవతలు, శేషనాగుడి ద్వారా ముత్యం తిరిగి శివునికి అందింది.శివుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చేస్తూ, నది తీరంలోని రాళ్లన్నింటినీ రత్నాలుగా మార్చి నదిలో విసిరాడు. అందుకే ఇక్కడ నీటితో పాటు విలువైన రత్నాలు కూడా కనిపిస్తాయని భక్తులు చెబుతారు.
వేడి నీటితో ప్రత్యేకతలు
పార్వతి నదిలో ఒకవైపు గడ్డకట్టే చలినీరు, మరోవైపు వేడి నీటి బుగ్గలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ వేడి నీటిలో అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడికిస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి.అంతేకాదు, ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు నయం అవుతాయని ప్రజలు నమ్మకం. ఈ నీరు 65°C నుంచి 80°C వరకు ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది.
భక్తుల నమ్మకాలు
ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించిన భక్తులు మనసుకు, ఆధ్యాత్మిక అనుభూతికి తృప్తి చెందుతారు. చలికాలంలో మంచు కురుస్తుంది, వేసవిలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన వారు శరీర సౌఖ్యాన్ని పొందుతారని, శివుని కృపకు పాత్రులవుతారని భక్తుల నమ్మకం.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటి?
ఇక్కడి వేడి నీటి బుగ్గలు ఒక ఫౌంటెన్‌ను సృష్టించి 10–15 అడుగుల ఎత్తుకు ఎగజిమ్ముతాయి. ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు నేటి వరకు వివరిచలేకపోయారు. అయినా, ఈ ప్రదేశం శివుని మహిమకు సాక్ష్యంగా నిలుస్తోంది.
మణికర్ణకు వెళితే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాకుండా ప్రకృతి అందాన్ని ఆస్వాదించగలరు.
ఇలాంటి మరెన్నో విషయాలు వ్యక్తిగతంగా పొందటానికి మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.
Related Posts
Shiva Pooja Vidhanam | విష్ణుమూర్తి తానే స్వయంగా చెప్పిన శివ పూజావిధానం.
Lord Shiva Worship | ఉద్యోగ ప్రాప్తి మరియు సిరి సంపదల కొరకు శివుడిని ఈ విధంగా పూజించండి.
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
Lord Shiva | శివుడుకి సోమవారం రోజు ఈ పనులు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.
Hanuman And Shiva | హనుమాన్, శివుడు ఒకే చోట! అష్ట ఐశ్వర్యాలతో పాటు కష్టాలు తీరే అద్భుత క్షేత్రం!