గ్రహ దోష నివారణకు గణపతి ఆరాధన ఎలా చేయాలి? | Graha Dosha Remedies in Telugu ?

2
39469
Remedies For Grah Doshs / గ్రహ దోషాలను తొలగించుకోవాలంటే ఏమి చెయ్యాలి ?
Remedies For Grah Doshs

Remedies For Grah Dosh

గ్రహదోషాలకు తగిన గణపతి పూజ:

మన జీవితంలో అనేక సమస్యలు గ్రహ దోషాల వలన కలుగుతుంటాయి. ఇలాంటి దోషాలను నివారించేందుకు గణపతిని పూజించడం శాస్త్రోక్తంగా, ఫలదాయకంగా ఉంటుంది. అయితే ఏ గ్రహ దోషానికి ఏ గణపతి రూపాన్ని పూజించాలి అనేది చాలామందికి తెలియదు. అందుకే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.

  • సూర్య దోషం: ఉన్నవారు ఎర్రచందనం తో తయారైన గణపతిని పూజించాలి. ఇది ఆరోగ్య పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది.
  • చంద్ర దోషం: నివారణకు వెండి లేదా పాలరాయి తో తయారైన గణపతి విగ్రహాన్ని పూజించాలి. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
  • కుజ దోషం: ఉన్నవారు రాగి తో చేసిన గణపతిని పూజిస్తే, శత్రుబంధనలు తొలగిపోతాయి. విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది.
  • బుధ గ్రహ దోషం: ఉన్నవారు మరకత రత్నంతో తయారైన గణపతిని పూజించాలి. ఇది విద్య, వాక్చాతుర్యం, వ్యాపారంలో అభివృద్ధిని ఇస్తుంది.
  • గురు దోషం: ఉన్నవారు పసుపు, చందనం లేదా బంగారం తో తయారైన గణపతిని పూజించాలి. ఇది జ్ఞానాన్ని పెంచి, జీవితంలో మేలు మార్గం చూపుతుంది.
  • శుక్ర దోషం: నివారణకు స్ఫటిక గణపతిని పూజించాలి. ఇది శాంతి, ఐశ్వర్యం, మరియు కుటుంబ ఆనందాన్ని అందిస్తుంది.
  • శని దోషం: ఉన్నవారు నల్లరాయి తో చేసిన గణపతిని పూజించాలి. శని ప్రభావం తగ్గించి, ఉద్యోగ స్థిరత, ధైర్యాన్ని కలిగిస్తుంది.
  • రాహు దోషం: నివారణకు మట్టితో చేసిన గణపతిని పూజిస్తే, అపకారాలు తొలగిపోతాయి. అదృష్టాన్ని కలిగిస్తుంది.
  • కేతు దోషం: ఉన్నవారు తెల్ల జిల్లేడుతో తయారైన గణపతిని పూజించాలి. ఇది భయాలను తొలగించి, మనశ్శాంతిని ఇస్తుంది.

ప్రత్యేక గణపతి రూపాల మహిమ:

  • ఎర్రచందన గణపతి: అనారోగ్య సమస్యలు తొలగించడంలో శక్తివంతమైనది

  • పగడపు గణపతి: అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు

  • పాలరాయి గణపతి: మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడు

  • శ్వేతార్క గణపతి: జీవితంలోని ప్రతిఘాతం తొలగిస్తాడు, శుభ మార్గం కలుగ చేస్తాడు

  • స్ఫటిక గణపతి: సుఖశాంతులందించే గణపతిగా ప్రసిద్ధి

Related Stories: 

మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies

నక్షత్ర దోషాలకు పరిష్కారాలు | Nakshatra Dosha Remedies in Telugu

రాహుగ్రహ సమస్యకు పరిహారమార్గం | Rahu Graha Dosha Remedies in Telugu

శుక్రగ్రహ దోష నివారణకు | Shukra Graha Dosha Remedies in Telugu.

గ్రహ దోష నివారణకు గణపతి ఆరాధన ఎలా చేయాలి? | Graha Dosha Remedies in Telugu ?

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha

జాతకంలో రాహువు-కేతువులు ఇబ్బంది పెడుతున్నారా? ఈ నివారణలతో విముక్తి పొందండి | Remedies For Rahu-Ketu Dosha

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here