
Venkateswara Swamy Vratham Story
1శ్రీ వేంకటేశ్వర వ్రతం, గోవింద నామాల మహిమ:
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
భగవంతునికి ఎన్నో నామాలున్నా, గోవింద నామం చాలా ప్రత్యేకమైనది. శ్రీ వేంకటేశ్వర స్వామిని గోవింద అని పిలువడం వల్ల భక్తులకు అపారమైన శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా, శ్రీ వేంకటేశ్వర స్వామికి గోవింద నామాలతో ముడిపడిన వ్రతం ప్రసిద్ధి చెందింది.
వ్రతం యొక్క ప్రాముఖ్యత:
1. కష్టాల నుండి గట్టెక్కడానికి
2. పాపాలను పోగొట్టడానికి
3. దోషాలను తొలగించడానికి
4. వ్యాధులు, బాధల నుండి విముక్తి పొందడానికి
5. తలపెట్టిన కార్యాలు నెరవేర్చుకోవడానికి
6. ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి
వ్రత విధానం:
దీక్షాధారణ: స్వామికి ముడుపు కట్టి, దీక్షను ప్రారంభించాలి.
కావలసిన వస్తువులు: అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము 1 మీటరు, 7 రూపాయి బిళ్లలు + 7 పావలా బిళ్లలు, ధూపం, దీపం, పసుపు, గంధం, నీళ్లు.
మాల తయారీ: వస్త్రాన్ని పసుపుతో అద్ది, ఆరబెట్టి, 7 ముడుపులు కట్టాలి.
మాల పవిత్రీకరణ: ఆవు పంచితం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంధం, నీళ్లతో అభిషేకం చేసి, కర్పూర నీరాజనం చేసి, గోవింద నామాన్ని 108 పర్యాయాలు జపించాలి.
వ్రత నియమాలు:
1. వైకుంఠ ఏకాదశికి 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, 7 రోజులు ముందుగా గాని వ్రతాన్ని ఆచరించవచ్చు.
2. స్త్రీలు 7 రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు.
3. వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9–30 గంటల నుండి తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో యాగపూజ – కంకణ ధారణ జరుగుతుంది. కావున భక్తులు హాజరుకాగలరు.
4. పసుపు వస్త్రాలు ధరించాలి, నుదుట తిరునామాలు పెట్టుకోవాలి.
5. ధూమం, మద్యం, మాంసాహారం, దాంపత్యం దూరంగా ఉండాలి.
6. ఉదయం, సాయంత్రం స్నానం చేసి, గోవింద నామం ధ్యానించాలి.
7. రోజుకు 1008 సార్లు ‘ఓం నమోవేంకటేశాయ’ మంత్రం జపించాలి.
8. ఎదుటి వారిని బాధించరాదు.
9. ‘గోవిందా’ అని పిలవాలి.
10. ఉపవాస కార్యక్రమాన్ని పాటించాలి.
వ్రత నిర్వహణ:
స్వామికి సమర్పించే ముడుపు: పచ్చకర్పూరం 50 గ్రాములు; జీడిపప్పు 50 గ్రాములు; ఎండు ద్రాక్ష 50 గ్రాములు; ఏలకులు 50 గ్రాములు; మిరియాలు 50 గ్రాములు; జీలకర్ర 50 గ్రాములు; బియ్యం 50 గ్రాములు; కర్పూరం 50 గ్రాములు.
ఇంటికి తెచ్చుకునే ముడుపు: బియ్యం 100 గ్రాములు; కొబ్బరికాయ 1; కర్పూరం 1 ప్యాకెట్.
పైన పేర్కొన్న పదార్థాలను రెండు విడివిడి సంచులలో వేసి, ముడివేసి తీసుకువెళ్ళాలి. వ్రతం పూర్తి అయిన తరువాత వచ్చే శనివారం నాడు ఇంటికి తెచ్చుకున్న ముడుపును పూజ చేసి ముగించవచ్చు.
గమనించవలసిన విషయాలు:
1. భక్తులు ఈ వ్రతాన్ని ఎన్ని వారాల ముందు ప్రారంభించాలనుకుంటున్నారో, తమ శక్తి మేరకు నిర్ణయించుకోవచ్చు.
2. స్త్రీలు 7 రోజుల పాటు వ్రతాన్ని ఆచరించవచ్చు.
3. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శನం కోసం తిరుపతి వెళ్ళే భక్తులు, గోవిందరాజస్వామి ఆలయంలో జరిగే యాగపూజ – కంకణ ధారణ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.
4. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూర్ణ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించే భక్తులను ఆయన కరుణ వదలదు. వారి ఇష్టాలు నెరవేర్చి, సుఖసంతోషాలు కలుగజేస్తాడు.
Related Posts
Shiva Pooja Vidhanam | విష్ణుమూర్తి తానే స్వయంగా చెప్పిన శివ పూజావిధానం.
Lord Shiva Worship | ఉద్యోగ ప్రాప్తి మరియు సిరి సంపదల కొరకు శివుడిని ఈ విధంగా పూజించండి.
Durga Devi | దుర్గాదేవి నుండి ప్రతి ఒక్క స్త్రీ నేర్చుకోవలసిన విషయాలు.
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules