
Hanuman Was Married?
1ఆంజనేయ స్వామి వారు ఎవరిని వివాహం చేసుకున్నారు ?
ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదని మీకు తెలుసా?! వారి భార్య పేరు!?
హనుమాన్, భారతీయ హిందూ ప్రముఖ దేవుళ్ళలో ఒకరు. ఆయన వానర సేనాపతి, వాయు పుత్రుడు మరియు శ్రీరాముడికి మహా భక్తుడు. హనుమాన్ ఒక అద్వితీయ శక్తివంతుడు, సామర్థ్యవంతుడు, మరియు మానవత్వం మీద ఆదర్శమైన ప్రేమను ప్రతిపాదించేవాడు. హనుమాన్ని “ఆంజనేయ”, “అంజనీ పుత్రుడు”, “వాయుపుత్రుడు”, ఆంజనేయుడు, పవన పుత్రుడు, మరియు హనుమాన్ అని అనేక పేర్లతో భక్తులు ఆదరిస్తారు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని భక్తులు నమ్ముతారు. మరి అలాంటి హనుమంతుని పూజలో సువర్చలాదేవిని పూజిస్తారెందుకు. ఇంతకీ ఎవరీ సువర్చల ఎవరు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
హనుమంతుడు బ్రహ్మచారిగా ఉంటూ సువర్చలా దేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? (Why Hanuman Married Suvarchala Devi While Being A Brahmachari?)
1. ఆంజనేయ స్వామి యొక్క గురువు సూర్యుడు అని మన అందరికి తెలుసు.
2. ఆంజనేయ స్వామి సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ వేదాల అన్నింటినీ నేర్చుకున్నాడు.
3. నవ వ్యాకరణాలుగా పిలవబడే 9 వ్యాకరణాలను కూడా హనుమంతుడు నేర్చుకోవాలనుకున్నాడు.
4. పెళ్లయిన వారికి మాత్రమే నవ వ్యాకరణాలు నేర్చుకునేందుకు అర్హత ఉండేదట.
5. ఆంజనేయ స్వామి బ్రహ్మచారిగా ఉండిపోవాలని పట్టుదలతో ఉండేవారు.
6. త్రిమూర్తులు ముగ్గురూ సమస్యను ఎలాగైనా తీర్చాలంటూ సూర్యుడి దగ్గరకు వెళ్లారు.
7. సూర్యుడు అప్పుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టిస్తారు, అలా వర్చస్సు నుంచి ఏర్పడిందే సువర్చల.
8. అప్పుడు సూర్యుడు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను మీరు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపారని మన వేద పండితులు చెబుతున్నారు.
9. ఆ తర్వాత హనుమాన్ కు నవ వ్యాకరణాలన్నీ నేర్పారట.
10. సూర్యుని తేజస్సుతో ఏర్పడింది కాబట్టి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు అని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts
ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/
సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities