తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? | ఏ రోజు ఏ ప్రసాదం?, వాటిని స్వీకరిస్తే కలిగే ఫలితాలు?! | Types of Prasads Offering to Sri Venkateshwara Swamy

0
1433
Facts of Tirumala Prasadas
What Types of Prasadams Offering to Lord Sri Venkateshwara Swamy?

List of Prasadams Offering to Tirumala Sri Venkateshwara Swamy

1తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే వివిధ ప్రసాదాలు

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? వాటిని స్వీకరిస్తే మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి.

తిరుమల ప్రసాదం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుపతి లడ్డు. మనకు తెలిసిన వారు ఎవరైనా తిరుమల వేళ్తున్నారంటె మనం వెంటనే ఒక లడ్డు తీసుకురమ్మని చెప్తాము. అంత బాగా ఫేమస్ తిరుమల లడ్డు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు సమర్పిస్తున్నారు. ఆ ప్రసాదాల ఏంటి, వాటి ప్రత్యేకత గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శ్రీ వేంకటేశ్వర స్వామికి అందించే ఆహార నైవేద్యాలు? (Types of Food Offerings to Lord Sri Venkateshwara Swamy?)

1. శేషాద్రి నిలయానికి ఇప్పటికి కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలు తయారు చేస్తారు.
2. శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఆ పోటు లో శ్రీ వారికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం మరియు పిండి వంటలు తయారు చేస్తారు.
3. అలా తయారు చేసిన ప్రసాదాన్ని మొదటగా శ్రీ భూవరహ స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తరువాత శ్రీవారికి గంటానాదం మధ్య నైవేద్యం సమర్పిస్తారు.
4. శ్రీ వారికి సుప్రభాత సమయంలో ఆవు పాలు, వెన్న మరియు చక్కెర సమర్పిస్తారు.
5. తరువాత బంగారు సింహాసనం పై శ్రీ వారిని ఉంచి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు.
6. మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న మరియు మీగడతో తయారు చేసిన మాత్రా అని పిలువబడే ప్రసాదాన్ని పగిలిన కుండలో ఉంచి స్వామివారికి సమర్పిస్తారు.
7. మధ్యాహ్న ఆరాధన తరువాత రెండవ గంటల్లో నిత్య అన్నప్రసాధాలతో పాటుగా శుద్దన్నం, పాయసం మరియు సీరాను నైవేద్యంగా అర్పిస్తారు.
8. కళ్యాణోత్సవం అనంతరం శ్రీవారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దోసతో పాటు చక్కెర పొంగలి, పొంగలి, దద్దోజనం, పులిహోర కూడా సమర్పిస్తారు.
9. తరువాత డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో చక్కర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పంచ కజ్జాయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు.
10. సాయంకాలం చేసే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు పులిహోర మరియు కధంభం నైవేద్యంగా శ్రీ వారికి సమర్పిస్తారు.
11. రాత్రి సమయంలో నివేదన మూడవ గంటలో చక్కెర పొంగలి, పోగాలి, కధంభం, ముళహోర వంటి అన్నప్రసాదాలు శ్రీవారికి నివేదన చేస్తారు.
12. తిరువీసం గంటలో శ్రీ వారికి చక్కర పొంగలి వైవేద్యంగా అర్పిస్తారు.
13. పవళింపు సేవలో చక్కర వేసిన పాలు, పండ్లు, పంచాకజ్జయం, మేవా అర్పిస్తారు.
14. శోభాయమనంగాను నిత్యోత్సవంతో భాగంగా సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డులు అన్నప్రసాధంగా పెడతారు.
15. బుధవారం రోజున శ్రీవారికి నిర్వహించే సహస్ర కలశాభిషేఖంలో క్షీరాన్నంతో పాటుగా రోజు సమర్పించే అన్నప్రసాదాలు నైవేద్యంగా పెడతారు.
16. గురువారం రోజున జరిగే తిరుప్పావైవడ సేవలో 420 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోరను శ్రీ వారికి నివేదిస్తారు.
17. శుక్రవారం రోజున పోళీలు మరియు సుగీలను శ్రీవారికి సమర్పిస్తారు.
18. ఆదివారం చలిపింది అనే ప్రసాదాన్ని ప్రత్యేకంగా పెడతారు.
19. శ్రీవారికి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మరియు ప్రత్యేక పర్వదినాల్లో దోసేల్లు, శనగపప్పుతో చేసిన గుగ్గిలను పెడతారు.

శ్రీ వారు తన చూపులతో ఆ నైవేద్యాన్ని పవిత్రం చేసి మరియు ఆస్వాదించి, తన భక్తులకు ప్రసాదాలుగా ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టీ కలుగుతాయి, మరియు ఎన్నో కోరికలు నెరవేరడంతోపాటు వారి వారి అంతుబట్టని రోగాలు కూడా ఇట్టె మాయం అవుతాయి. ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుంది శ్రీ వారి భక్తుల విశ్వాసం.

Spiritual Related Posts

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings

తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules

గుడిలో ప్ర‌ద‌క్షిణ చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనక భాగాన్ని తాక‌కూడ‌దా? అలా చేయడం వలన జరిగే పరిణామాలు ఏమిటి? | Why Shouldn’t We Touch Backside of The Temple During Pradakshina?

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/