
What are 9 Incarnations of Goddess Durga Devi & Temples Details
1దుర్గాదేవి 9 అవతారాల దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?
దుర్గాదేవి అమ్మవారి 9 అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా?
1. శైలపుత్రి (Shailaputri)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క మొదటి అవతారం శైలపుత్రి.
2. అమ్మవారి శైలపుత్రి ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది.
3. శైల రజగు హిమవంతుని యొక్క కుమార్తెగా దుర్గామాత జన్మించినది.
4. దుర్గాదేవి అమ్మవారి వృషభ వాహనం పైన కుర్చుని కుడి చేత త్రిశూలం మరియు ఎడమ చేత పద్మం ధరించి దర్శనం ఇస్తారు.
5. శరన్నవరాత్రులలో అమ్మవారిని అలంకరించి, పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు అమ్మవారిని వేడుకుంటారు.
2. బ్రహ్మచారిని (Brahmacharini)
1. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారినిగా అవతరించారు.
2. ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించారు.
3. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి దర్శనం ఇస్తారు.
4. పరమ శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి మాట మేరకు ఘోర తపస్సు చేసినదని పురాణాలు చేబుతున్నాయి.
5. ఈ అమ్మవారిని పూజించడం వలన మంచి విజయం లభిస్తుంది.
3. చంద్రఘంట (Chandraghanta)
1. దుర్గదేవి అమ్మవారి 3వ అవతారం చంద్రఘంట.
2. ఈ అమ్మవారి యొక్క ఆలయం వారణాసిలో ఉంది.
3. ఇక్కడ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి దర్శనమిస్తుంది.
4. ఈ అమ్మవారు 10 చేతులతో దర్శనం ఇస్తుంది.
5. ఇక్కడ అమ్మవారిని పూజించడాం వలన భయం మరియు అపజయం నుండి విముక్తి కలుగుతుంది.
4. కూష్మాండ (Kushmanda)
1. దుర్గాదేవి అమ్మవారి 4వ అవతారం కూష్మాండ.
2. ఈ అమ్మవారి యొక్క ఆలయం కాన్పూర్ లో ఉంది.
3. ఇక్కడ అమ్మవారు సింహ వాహనం పైన 8 చేతులతో దర్శనం ఇస్తుంది.
4. ఇక్కడ అమ్మవారిని పూజించడాం వలన శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.
5. స్కందమాత (Skandamata)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క 5వ అవతారం స్కందమాత.
2. స్కందుడు అంటే అర్ధం కుమారస్వామి అని. ఆ అవతారం స్కందుడి యొక్క తల్లి అందువలన ఈ అమ్మవారిని స్కందమాత అని అంటారు.
3. ఇక్కడ ఈ దుర్గదేవి అమ్మవారు బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తుంది.
4. ఇక్కడ అమ్మవారిని దేవిని పూజిస్తే అపజయం అనేది ఉండదు.
6. క్యాత్యాయని (Katyayani)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క 6వ అవతారం క్యాత్యాయని.ఈ అమ్మ వారి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
2. కోత్స అనే ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయడం వలన అతడి కూతురిగా జన్మించింది.
3. అందుకే ఈ అమావారికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది అని పురణాలు చెబుతున్నాయి.
7. కాళరాత్రి (Kalaratri)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క 6వ అవతారం కాళరాత్రి.
2. ఈ అమ్మవారి శరీరం ఛాయా చీకటితో నలపు రంగులో ఉంటుంది. అందువలనే అమ్మవారికి కాళరాత్రి అనే పేరు వచ్చినది.
3. ఈ అమ్మవారి ఈ దేవి వాహనం గాడిద.
4. ఈ అమ్మవారి ఆలయం కూడా వారణాసిలో ఉంది.
5. ఈ అమ్మవారు ఎల్లప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంది అందువలన ఈ అమ్మవారిని శుభకరీ అని కూడా పిలుస్తారు.
8. మహాగౌరి (Mahagauri)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క 8వ అవతారం కాళరాత్రి.
2. ఈ అమ్మవారు పాల వలె తెల్లని కాంతితో దర్శనమిస్తుంది.
3. ఈ అమ్మవారు శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లగా అవుతుంది.
4. ఆమే భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు.
5. ఆరోజునుండి అమ్మవారు మహాగౌరిదేవిగా ప్రసిద్ధి చెందింది.
9. సిద్ధిధాత్రి (Siddhidhatri)
1. దుర్గాదేవి అమ్మవారి యొక్క 9వ అవతారం సిద్ధిధాత్రి.
2. దేవతలు,సిద్దులు మరియు మనుషులు అందరు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు.
3. ఈ అమ్మవారిని ప్రార్దిస్తే బుద్ది, విద్య మరియు భోగ భాగ్యాలను ప్రసదిస్తుంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ అమ్మవారి 9 అవతారాలు సంబంధించిన చాలా ఆలయాలు వారణాసిలోనే ఉన్నాయి.
Navaratri Durga Puja Related Posts
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/