
Why Do We Offer Bilva Patra (Bel Leaves) to Lord Shiva?
1శివలింగానికి బిల్వదళాలతో అర్చన వల్ల కలిగే ప్రయోజనాలు
మన భారత హిందూ మతంలో పరమ శివుని ఆరాధనలో బిల్వ పత్రాల అర్చనకు అద్బుతమైన ప్రాముఖ్యత ఉంది. బిల్వపత్రం లేకుండా పరమ శివునికి ఆరాధన చేస్తే అది అసంపూర్ణంగా. శ్రావణ మాసంలో పరమ శివుడిని, మహావిష్ణువును విశేషంగా పూజలు చేస్తారు. పరమ శివునికి పాలు, తేనె, నెయ్యి, చక్కెర మరియు పెరుగు తో కలిసి అభిషేకం చేస్తారు. అలాగే అనేక రకాల ఫలాలతో అర్చిస్తారు.
శ్రావణ మాసంలో ఆ మహా పరమేశ్వరునికి పూజ చేయడం వలన విశేష వైభవం దక్కుతుంది. పరమ శివుడిని అభిషేక ప్రియుడని అంటారు. మన హిందూమతంలో శివలింగానికి పాలు మరియు బిల్వ పత్రాలను సమర్పించి ప్రత్యేకమైన పూజలు జరుపుతారు. మన హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పరమ శివునికి పాలను నైవేద్యంగా సమర్పించే ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఈ మాసం లో పశువులు గడ్డి తినడం వలన గడ్డితో పాటు అనేక రకాల కీటకాలను కూడా తింటాయి. ఆ కీటకాలను తినడం వలన వాటి పాలు హానికరం అవుతాయి. అందుకే శ్రావణ మాసంలో పాలు తాగకుండా పరమశివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో పాలు ఆహరంగా తీసుకోకూడదు అంటారు. దానికి కారణం పాలతో చేసిన ఆహారం తీసుకోవడం వలన వాత వ్యాధి వస్తుంది అని అంటారు. ఈ మాసంలో పాలు తాగడం వల్ల శరీరంలో పిత్త, కఫా అసమతుల్యత గురి అవుతారు. దీనివలన అనేక వ్యాధులకు కూడా సంభవిస్తాయి. ఈ మాసంలో పాల వల్ల కలిగే రాకుండా ఆ పాలను పరమ శివునికి సమర్పిస్తారు.
శివ పూజలో ఎందుకు బిల్వదళాలను ఉపయోగిస్తారు?! (Why Are Bilvadalas Used in Shiva Puja?!)
బిల్వపత్రంలో పార్వతీదేవి యొక్క అన్ని రూపాలు నివసిస్తాయి అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. దాని ప్రకారం ఒకరోజు పార్వతీదేవి మందరాచల్ పర్వతాన్ని వెళ్ళినప్పుడు పార్వతి దేవి చెమట చుక్కలు కొన్ని మందరాచల్ పర్వతంపై పడ్డాయంట. దాని ద్వారా బిల్వ పత్ర చెట్టు పెరిగింది అని స్కాంద పురాణం చెప్తుంది.
గిరిజ దేవి రూపం బిల్వపత్రం చెట్టు వేరులో ఉందని, మహేశ్వరి దేవి రూపం నారలో ఉందని, దక్షిణాయనదేవి రూపం కొమ్మలలో ఉందని, పార్వతిదేవి రూపం ఆకులలో ఉందని నమ్ముతారు. కాత్యాయనీ దేవి రూపం మరియు గౌరి దేవి రూపం బిల్వ చెట్టు యొక్క పండులో ఉందని అంటారు.
పార్వతీదేవి బిల్వపత్రంలో నివాసం ఉండడం వలన పరమ శివునికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు. పరమ శివునికి బిల్వ పత్రం సమర్పించడం వల్ల సంతోషంతో భక్తుల కోరికలు తీరుస్తాడు అని అంటారు.
మన భారత హిందూ మతంలోని విశ్వాసం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించకపోతే వారు బిల్వ చెట్టు యొక్క మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన పుణ్య ఫలం లభిస్తుందంటారు.
Navaratri Related Posts
పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?
పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi
Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/