శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

0
1629
Why sri venkateswara swami likes saturday
Why Saturday Is Special to Lord Venkateswara Swamy?

Why Saturday Is Special to Lord Venkateswara Swamy?

1శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టం?

ఆ గోవిందుడికి శనివారం అంటేనే ఎందుకు అంత ఇష్టం. ఆ రోజేనే గోవిందుడుని దర్శించలా?

మన పురాణాలలో ఏ వారం ఏ దేవుడికి పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో పూర్వమే పేర్కొనబడింది.

ఆదివారం సూర్యభగవానుడుని, సోమవారం పరమశివుడిని, మంగళవారం సుబ్రమణ్య స్వామిని మరియు ఆంజనేయ స్వామిని , బుధవారం మణిఖంఠ స్వామిని మరియు వినాయకున్ని, గురువారం సాయిబాబాని మరియు దక్షిణామూర్తిని, శుక్రవారం అమ్మవారిని, శనివారం శ్రీ మహావిష్ణువు మరియు అతని దశావతారాలను పూజిస్తారు. ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో రోజుని ప్రత్యేకంగా పూజిస్తారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఆ ఏడుకొండల స్వామి. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుడు. ఏడుకొండల స్వామిని అలంకారప్రియుడని శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు. ఆ ఏడుకొండల స్వామికి శనివారం ఎందుకు ప్రత్యేకం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శనివారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి? (Why We Worship Lord Sri Venkateswara Swamy on Saturday?)

శని దోషాల నివృత్తి కోసం ఆ ఏడుకొండల స్వామిని శనివారం ఆరాధిస్తారు. అలా ఆ స్వామి వారిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం,

1. ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే
2. ఆ ఏడుకొండల స్వామిని పరమ భక్తి శ్రద్ధలతో పూజించే వారిని పీడించనని శనీశ్వరుడు ఆ స్వామికి వాగ్దానం ఇచ్చిన రోజు శనివారమే.
3. తిరుమల ఆలయ నిర్మాణం చేయమని ఆ ఏడుకొండల స్వామి తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే.
4. ఆ ఏడుకొండల స్వామిని భక్తులు మొదటిసారి దర్శించుకున్న రోజు శనివారమే.
5. ఆ ఏడుకొండల స్వామి ఆలయంలోకి ప్రవేశం చేసింది శనివారమే.
6. పద్మావతి అమ్మవారిని ఏడుకొండల స్వామి వివాహం చేసుకున్నది శనివారమే.
7. ఏడుకొండల స్వామి శ్రీ మహాలక్ష్మిఅమ్మవారిని తన వక్ష స్థలాన నిలిపిన రోజు శనివారమే.
8. ఏడుకొండల స్వామి సుదర్శనం పుట్టింది కూడా శనివారమే.

అందుకే ఏడుకొండల స్వామి వారికి శనివారమంటే అంత మక్కువ.

శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్నా లేదా పూజించినా కలిగే లాభాలు ఏమిటి?! (What are the Benefits of Visiting or Worshiping Sri Venkateswara Swamy on Saturday?!)

శనివారం పూట శ్రీ వారిని దర్శించుకోవడం వల్ల మంచి పుణ్యం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. ఒక వేల శనివారం రోజున ఆ స్వామిని దర్శించుకోలేని వారు ఇంట్లోనే పూజలు చేసుకుని ఆ స్వామిని స్మరించుకున్న శుభ ఫలితాలు చేకూరుతాయని చేప్తుంటారు. శనివారం రోజున రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసిన కూడా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.

Related Posts

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/