Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

0
3644
Rakshabandham rules
Need to Follow These Rules on Raksha Bandhan

Raksha Bandhan Rules

1రాఖీ కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు

మీరు మీ తొడ పుట్టిన వారికి రాఖీ కడుతున్నారా? ఐతే కట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాఖీ పండుగను మన హిందూ మహిళలు చాలా సంతోషంగా జరుపుకుంటారు. తమ యొక్క సోదరుడు ఎంత దూరంలో ఉన్న కూడా ఈ రోజున మాత్రం వారి దగ్గరకు వెళ్లి మరీ రాఖీ కడతారు. సోదరులు కూడా తమ అక్కా, చెల్లెళ్ల పట్ల చాలా ప్రేమను చూపిస్తారు, వారి కష్టాల్లో తోడుగా ఉంటారని. రాఖీ పున్నమి గురించి చాలామందికి అనేక ప్రశ్నలు తరచుగా సతమతానికి గురిచేస్తుంటాయి. ఆ ప్రశ్నలు రాఖీని ఏ దిశలో కూర్చుని కట్టాలి, రాఖీని ఎంతకాలం చేతికి ఉంచుకోవాలి, రాఖీ ఎప్పుడు తీయాలి మరియు రాఖీ పాడైపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మన భారతీయ హిందూ పండితులు చక్కగా వివరణ ఇచ్చారు.

రక్షా బంధన్ ఆచారాన్ని ఎలా నిర్వహించాలి? (How to perform Raksha Bandhan Ritual?)

1. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి అని పండితులు వివరించారు.
2. రాఖీ కడుతున్న సోదరి పడమర లేదా ఉత్తర ముఖంగా ఉండాలి.
3. మన హిందూ మతంలో ఏమైనా శుభ కార్యం చేసే ముందు ఆ రోజున దిశ మరియు శుభ సమయం చూస్తారు. రాఖీ పున్నమి నాడు రాఖీ కట్టేటప్పుడు సోదరుడు యొక్క ముఖం తూర్పు దిశలో ఉండాలి. అలాగే రాఖీ కట్టే సోదరి పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలి. అప్పుడు ఎవరికీ దక్షిణం వైపు ఎదురుగా ఉండకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది పండితులు చెబుతున్నారు.
4. రాఖీ కట్టిన తర్వాత కొన్ని రోజులు సోదరుడు ఆ రాఖీ ని చేతికి పెట్టుకోవాలి. అలా అని ఎక్కువ రోజులు ఉంచుకోకుడదు. రాఖీని ఎక్కువ రోజులు ఆ రాఖిని చేతికి ఉంచుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారు.
5. అలా చేతికే రాఖిని ఉంచుకుంటే సోదరుడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చాలా రోజులు రాఖీని చేతిలో పెట్టుకోకూడదనుకుంటే కృష్ణ జన్మాష్టమి రోజు రాఖీని తొలగించుకోవచ్చు లేదా రాఖీని ఎప్పుడూ ఒక పవిత్రమైన రోజు మాత్రమే చేతి నుండి తీసివేయాలి.
6. రాఖీని సోదరుడు చేతికి చాలా రోజులు కట్టుకోవడం వల్ల అది విరిగిపోతుంది. అలా విరిగిన రాఖీని చేతి మణికట్టు మీద ఉంచకూడదు. అలా ఉంచుకోవడం అశుభంగా భావిస్తారు.
7. ప్రవహించే నీటిలో ఆ రాఖిని వేయాలి. విరిగిన వస్తువులు మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉండడం వలన మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి.
8. చాలా మంది రాఖీని విరిచి అక్కడక్కడ వేస్తారు. అలా అస్సలు చేయకూడదు.
9. ఆ రాఖీని ఎరుపు రంగు గుడ్డలో చుట్టి మీరు పూజ చేసే పవిత్ర స్థలంలో ఉంచాలి.

Related Posts

రాఖీ పండుగ రోజే భద్ర కాలం! పొరపాటును కూడా ఈ సమయంలో రాఖీ కట్టకండి!? | Rakshabandhan 2024

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు?! Why Buy Gold in Shravana Masam Varalakshmi Vratam

వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu

Varalakshmi Vratham Pooja Vidhanam | వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు?

శివునికి ఇష్టమైన శ్రావణం మాసంలో ఈ రాశుల వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆశీస్సులు వీరికి సొంతం!? | Lord Shiva Blessings in Shravana Masam

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

శ్రావణమాసంలో శివునికి ఇష్టమైన రాశులివే. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి! | Lucky Zodiacs to Lord Shiva

Sravana Pournami Significance in Telugu? | శ్రావణ పౌర్ణమి ప్రాముక్యత ఏమిటి ?

Sravana Somavaram Pooja in Telugu | శ్రావణ సోమవారం – ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి?