
Shravana Putrada Ekadashi 2026
1శ్రావణ పుత్రదా ఏకాదశి 2026
హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కో ఏకాదశికీ ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశికి కూడ ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఉంది. భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది.
శ్రావణ పుత్రదా ఏకాదశి కథ (Shravana Putrada Ekadashi Story)
కథలోకి వెళితే మహిజిత్తు అనే మహారాజు ఉండేవాడట. రాజ్యంలో ఉన్న ప్రజలు అంత సిరిసంపదలతో సంతోషముగా ఉంటారు. కానీ రాజు గారికి సంతానం లేదు, ఈ కారణంగా దేశ ప్రజలు బాధతో ఉండేవారు. మహారాజు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రం లేదు. దీనికి పరిష్కారం మహరాజు తెలుస్తుంది అదేమిటంటే రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి దగ్గర ఉందని. ఆయన్ని దర్శించుకోని వారికున్న సందేహం విన్నవించుకుంటారు. మహారాజు కి ఏ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందో వివరించాలని ప్రజలు ఆ లోమశు మహర్షిని వేడుకున్నారు. దాంతో ఈ పుత్రద ఏకాదశి పూజ విధానం మరియు ఎలా ఆచరించాలో ఇలా చెప్పాడు. శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి రోజున నిష్టగా చేస్తే మహారాజుకి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. ఆయన సూచన మేరకు రాజదంపతులతో పాటుగా ఆ రాజ్యంలోని ప్రజలందరు ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజు గారికి పుత్రసంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదో ఈ వ్రతం ఆచరించిన వాళ్ళందరికి సంతానం ప్రాప్తించింది. అందుకే అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు.
శ్రావణ పుత్రదా ఏకాదశి 2026 తేదీ & ముహూర్త సమయం (Shravana Putrada Ekadashi 2026 Date & Muhurt Timings)
-
- ఏకాదశి తిథి ప్రారంభం: ఆగస్టు 23, 2026 నాడు ఉదయం 02:00 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు: ఆగస్టు 24, 2026 నాడు ఉదయం 04:18 గంటలకు
- హరి వాసర ముగింపు సమయం: ఆగస్టు 24, 2026 నాడు ఉదయం 10:49 గంటలకు
- పారణ సమయం (ఉపవాస విరమణ): ఆగస్టు 24, 2026 నాడు మధ్యాహ్నం 01:57 నుండి సాయంత్రం 04:28 గంటల వరకు
శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం మరియు పూజ విధి (Shravana Putrada Ekadashi Vrat & Puja Vidh)
దంపతులు పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుండి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలతో పూజించాలి. ఆ ఏకాదశి రోజున రాత్రి పూట జాగరణ చేయాలి. తర్వాత రోజున దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించాలి. ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగా విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని అని నమ్మకం మరియు సంతానం కలుగుతుంది.
శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం విశిష్టత (Shravana Putrada Ekadashi Vrat Significances)
ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి అత్యంత ప్రత్యేకత కలిగి ఉంది. పుత్రద ఏకాదశి రోజున కుబేరుని జన్మదినం అని నమ్మకం. కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే సిరి సంపదలు ప్రసాదించు మరియు అనుగ్రహం తప్పక లభిస్తుంది. కుబేర అష్టోత్తరాన్ని పఠించినా శుభ ఫలితాలు దక్కుతాయి.
Related Posts
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పరమ ఏకాదశి వ్రతము 2026 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2026
పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room
మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti
పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant








