శ్రీవారి ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు ఏమిటి?! | Behind the Story of Tirumala Shasanas

0
920
Tirumala Shasanas
Tirumala Shasanas & Secretes

Story Behind Tirumala Shasanas

1తిరుమల ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు

తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే కలియుగ వైకుంఠం అని భక్తుల నమ్మకం. అలాంటి ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవు. శ్రివారి ఆలయంలో ఇప్పటికి చెక్కు చేదరని ఆదరాలు శిలా శాసననాల రూపంలో ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే,

1. స్వామి వారి ఆలయానికి ఎవరెవరు ఎంత మాన్యాలు, డబ్బులు విరాళంగా అందించారు?.
2. చక్రవర్తులు, రాజులూ స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు, అప్పట్లో వాటి విలువ ఎంత?.
3. ఏ రాజు స్వామి వారికి దానంగా ఇవ్వబడిన గ్రామాలు?.
4. విమాన గోపురానికి బంగారు తాపడం చేయించింది ఎవరు??.

ఇలా శ్రీవారి ఆలయ గోడలపై చెక్కబడిన రాతి శాసనాలే ఇప్పటి తరానికి మరియు రాబోయే తరాలకి ఆలయ చరిత్రను అందిస్తున్నాయి.

శాసనాల వివరాలు

శ్రివారి ఆలయంలో దాదాపుగా 1,180 శాసనాలు ఉన్నట్లు తెలుస్తుంది.

1. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయ నగర సామ్రాజ్య సంస్థానాదీశుల కాలం నాటివి 236 శాసనాలు ఉన్నాయి.
2. సాళువ నరసింహ రాయునివి 169 శాసనాలు ఉన్నాయి.
3. శ్రీ కృష్ణ దేవరాయుని కాలంలో 229., అచ్యుత రాయల కాలం నాటివి 251 శాసనాలు గుర్తించారు.
4. సదాశివ రాయుని కాలంనాటివి మరో 147 శాశనాలు లభ్యం అయ్యాయి.

ఇవన్ని కూడ 1920-30 మధ్య కాలంలో తిరుపతిలో ఉన్న అన్ని ఆలయాల నుంచి సేకరించబడినవి.

1. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 340 శాసనాలు.
2. తిరుమల శ్రీవారి ఆలయంలో 640.
3. మిగతా ఆలయాల్లో 200కి పైగ శాసనాలను గుర్తించారు.
4. ఇంకా 100కి పైగా శాసనాలను గుర్తించాల్సి ఉంది.

శాసనాలు & భాషలు

1280 శాసనాల వివరాలను తిరుమలలోని SV మ్యూజియంలో ఉంచింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో ఉన్న దాదాపు శాసనాలు అన్ని కూడా క్రీస్తు శకం 830లో పల్లవ రాజు కాలంలో దంతి విక్రమార్క కాలం నుంచి 1909లో మహంత్ ప్రయోగాదాస్ కాలం వరకు ఉన్నవి.

ఈ శాసనాల్లో అధికంగా తమిళ భాషలో ఉన్నాయి. తెలుగు, కన్నడ భాషల్లో 50 శాసనాలు మాత్రమే ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయుని కాలానికి ముందు ఓకే ఒక్క శాసనం మాత్రమే తెలుగులో ఉంది.

1. 1281వ సంవత్సరంలో సాళువ మంగిదేవ మహారాయ కాలంలో చేక్కిన తెలుగు శాసనం ఆలయ గోడలపై ఉంది.
2. దేవరాయలు కాలం మునుపు 2 & వీరప్రతాప దేవరాయుల కాలం నాటిది ఒక్కటి శాసనాలు కన్నడంలో ఉన్నాయి.
3. సాళువ నరసింహ రాయుల కాలానికి చెందిన శాసనాలు ఉన్నాయి.

శ్రీవారికి కానుకలు సమర్పించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణ దేవరాయల వారు. స్వామి వారికీ నైవేద్యం సమర్పించిన పిమ్మటే గంటానాథం విని ఆహారాన్ని స్వీకరించేంత భక్తి కలిగిన వాడు శ్రీ దేవరాయలు. ఆయనే శ్రీవారికి ఎన్నో ఆభరణాలు, మణులు, మాన్యాలు సమర్పించారు. వీటికి సంభందించిన వివరాలు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. మొదట ధూపదీప నైవేద్యానికి ఇచ్చిన కానుకల వివరాలు నిక్షిప్తం అయ్యి ఉన్నాయి.

శాసనాలు & సంవత్సరాలు

1. క్రీ.శ. 1001లో చాలా రాజులూ శ్రీవారికి ఆభరణాలు సమర్పించిన శాసనాలు ఉన్నాయి.
2. పల్లవులు సామవై ధ్రువబేరాన్ని పోలన భోగ శ్రీనివాస మూర్తితో పాటుగా ఆభరణాలను సైతం కానుకలుగా సమర్పించిన వివరాలు శాసనాలలో ఉన్నాయి.
3. 1250-70 కాలంలో జాతవర్మ సుందర పాండియన్ ఆలయ గోపురంపై ఉన్న కలశ ప్రతిష్టాపన చేసారు.
4. 1281లో సాళువ మంగిదేవ మహరాయులు విమాన గోపురానికి రాగి రేకుల తాపడం చేయించారు.
5. 13వ శతాబ్దంలో వీర నరసింహ యాదవ రాయులు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు అని శాసనాలలో ఉంది.
6. తిరువెంకట రాయులు శ్రీవారి ఆలయానికి 2 గ్రామాలను దానం చేసారు.
7. రెండవ దేవరాయలు 3 గ్రామాలను విరాళంగా ఇచ్చారు.
8. 1378 – 1410 మద్య కాలంలో సాళువ నరసింహ రాయులు అనేక గ్రామాలను స్వామి వారికీ కానుకగా సమర్పించారు.
9. 1434 – 1442 మధ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు 7 సార్లు శ్రీవారిని దర్శించుకోని, వచ్చిన ప్రతిసారి అనేక విలువైన ఆభరణాలను స్వామి వారికీ సమర్పించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి.
10. వారాధాజీ దేవి అమ్మన్ మహారాణి శ్రీవారికి 6 గ్రామాలను దానంగా ఇచ్చారు.
11. మాట్లి కుమార అనంత రాజూ స్వామివారి ఊరేగింపు కొరకు అశ్వ, గజ, సర్వ భూపాల వాహనంతో పాటుగా రత్నాలు పొదిగిన కిరీటం మరియు పద్మపీఠం దానంగా ఇచ్చారు.

అలా చక్రవర్తులు, రారాజులు ఇచ్చిన కానుకల గురుంచి ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి అంటే అవి కేవలం వారు చేక్కించిన శిలా శాసనాలే కారణం.

Related Posts

శ్రీవారి భక్తులు అలర్ట్! ఈ నెల 24న టికెట్లు విడుదల!? | TTD Online Tickets Releasing

శ్రీశైలంలో 17 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం!! Maha Kumbhabhishekam in Srisailam Temple 2023

14 ఏళ్ల శ్రీరాముడు వనవాసం రహస్యాలు & కారణాలు? | Secret Behind Rama’s 14 Years Exiled

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras

ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House