
Narasimha Swamy Avatar End by Lord Shiva
1శివునిచే నరసింహ స్వామి అవతారం ముగిసిందా
శ్రీ మహా విష్ణువువే హిరణ్యకశిపుని వధించడానికి నరసింహావతారం ఎత్తారు.
హిరణ్యకశిపుడు జననం (Hiranyakashipu Birth)
మహా శివుడుకి నరసింహ అవతారంకి ఉన్న సంబంధం ఏమిటోతెలుసుకుందాం. అసలు కథ లోకి వెళ్తే, సప్త ఋషులులో ఒకరు అయినా కశ్యపుడికి శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించారు. కాలక్రమేణా వాళ్ళు ఇద్దరు పెరిగి పెద్ద అయిన తరువాత రాక్షసులుగా మారారు. హిరణ్యాక్షుడు దేవతలను అనేక ఇబ్బందులు పెడతాడు. హిరణ్యాక్షుడు దేవతా లోకాన్ని ఆక్రమిస్తాడు, దీనితో ఏమి చెయ్యాలో తెలియక దేవతలు అందరూ కలిసి శ్రీ మహా విష్ణువు దగ్గరకు పరిష్కారం కోసం వెళ్తారు. విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుణ్ని సంహరిస్తారు.