అనారోగ్యాలను తొలగించి ఆయురారోగ్యాలను పొందాలంటే ? | Dattatreya Swamy aradhana for Health in telugu

0
5508

healthy lifestyle

Dattatreya Swamy Pooja Benefits

ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కోరుతున్నారా? అయితే గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని భక్తితో ఆరాధించండి.

దత్తాత్రేయ స్వామిని పసుపురంగు పూలతో పూజించడం వల్ల శరీరంలోని దోషాలు తొలగి, శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
దత్త నామస్మరణ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, దుఃఖాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇది సంపదల ప్రవాహానికి కూడా మార్గం చేస్తుంది.

గురువారం రోజు ఉదయం దత్తాత్రేయస్వామి పటానికి పసుపు పూలతో పూజ చేసి, “శ్రీ గురుదత్తాత్రేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం.
ఈ విధంగా చేసిన పూజ ఆరోగ్య సమస్యలను తగ్గించడమే కాక, జీవితం లో శాంతి, సంతృప్తి, ధనప్రాప్తి లభించడానికి దోహదపడుతుంది.

దత్తాత్రేయస్వామి స్తోత్రం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు!!
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు!!
శరణ గతదీనార్తపరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు!!
సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు!!
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు!!
శోషణం పాపపంకస్య దీపనంజ్ఞానచేతసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు!!
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు!!
జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు!!
జయలాభయసః కామదాతు ర్దత్తస్య హః స్తవం భోగమోక్షప్రస్యేమం య పఠేత్ సుకృతీ భవేత్!!

Related Dattatreya Swamy Slokas

Sri Dattatreya Dwadasa Nama Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

Sri Dattatreya Chinmaya Ashtakam In Telugu | శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకం

Sri Dattatreya Chaturdasa Nama Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

Sri Dattatreya Karunatripadi In Telugu | శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)

Sri Dattatreya Ashta Chakra Beeja Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం

Sri Dattatreya Stotram (Kartavirya Arjuna Krutam) In Telugu | శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)

Sri Dattatreya Shanti Stotram Lyrics In Telugu | శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here