
Dasara Festival
1. దసరా
రావణున్ని రాముడు చంపిన రోజు,
మహిషాసురుణ్ని దుర్గమ్మ హతమార్చిన రోజు,
పాండవులు వనవాసం అజ్ఞాత వాసమము తో కలిపి పూర్తిచేసిన రోజు ,
చెడుపై మంచి గెలిచిన రోజు. అదే విజయదశమి అని మనకు తెలుసు. మరి ఒక్కోచోట ఈ పండగని ఒక్కోలా జరుపుతారని తెలుసా?
దసరాకి 400 ఏళ్ల చరిత్ర
దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. ఈ పండగను ముఖ్యంగా కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లోఈ సంబరాలను ప్రారంభించిన వడియార్ రాజ వంశీకులు ఇప్పటికీ పూజల్లో పాల్గొనడం విశేషం. దసరా నాడు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండక్కి లక్ష విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రపంచ రికార్డు.
షోడశోపచార
షోడశోపచార పేరుతో ఒడిషాలో 16 రోజులపాటు వేడుకల్ని జరుపుతారు. చివరి రోజు అమ్మవారికి పెరుగన్నం, కేకులతో పాటు చేపల వేపుడును నివేదిస్తారు.
చర్చిల్లో
పుస్తకాలకు పూజ చేయడమనే అలవాటును కేరళలోని కొందరు క్రైస్తవులు కూడా పాటించడం విశేషం. కొన్ని చర్చిల్లో పిల్లలకు దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.
- గుజరాత్‌లో వూరూరా గార్బా, దాండియా రాస్ నృత్యాలతో సంబరాలు మిన్నంటుతాయి.
- మహారాష్ట్రలో సీమోల్లంఘనం పేరుతో తమ వూరి పొలిమేరలు దాటి వస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.
- మనం దసరాకి ముందు నవరాత్రులు జరిపితే హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో దసరా తర్వాత ఏడు రోజులపాటు వేడుకలు చేసుకుంటారు. విజయదశమినాడు రామలక్ష్మణసీతా విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రథాన్ని లాగుతారు.
- మన దేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, మారిషస్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు జరుగుతాయి.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Durga Puja Related Posts
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/