వైకుంఠ చతుర్దశి విశిష్టత | Vaikunta Chaturdashi Importance in Telugu

0
8508
vaikuntha chaturdashi
vaikuntha chaturdashi importance

Vaikuntha Chaturdashi 2025

వైకుంఠ చతుర్దశి

కార్తీక శుద్ధ చతుర్దశిని ‘వైకుంఠ చతుర్దశి’గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.

ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు.

ఇక ఈ కార్తీకమాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను … విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను … శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా నోములు … వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు … అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది.

ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే ‘వైకుంఠ చతుర్దశి’. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి, ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైనరోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున లింగావ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది.

శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి … ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.

Vaikuntha Chaturdashi 2025 Date & Muhurt

మంగళవారం, నవంబర్ 4, 2025 నాడు వైకుంఠ చతుర్దశి

వైకుంఠ చతుర్దశి నిశితకాలం – 11:35 PM నుండి 12:25 AM వరకు, నవంబర్ 05
వ్యవధి – 00 గంటలు 50 నిమిషాలు

నవంబర్ 5, 2025 బుధవారం దేవ్ దీపావళి
చతుర్దశి తిథి ప్రారంభం – నవంబర్ 04, 2025న 02:05 AM
చతుర్దశి తిథి ముగుస్తుంది – నవంబర్ 04, 2025న రాత్రి 10:36 గంటలకు

Related Stories

కూర్మావతార కథ | Kurma Avatar Story in Telugu

కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము | Karthika Puranam 15th Chapter in Telugu

కార్తీక పురాణం – పదహారవ అధ్యాయము | Karthika Puranam 16th Chapter in Telugu

కార్తిక పురాణం – పదిహేడవ అధ్యాయము | Karthika Puranam 17th Chapter in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here