జలగర్భంలో ద్వారక, మునిగిన కారణాలు | Story of Dwaraka City in Telugu

1
13493
Dwaraka2
Dwaraka City | జలగర్భంలో ద్వారక

Dwaraka City in Under Water

1జలగర్భంలో ద్వారక

కోట్ల సంవత్సరాల భారతీయ నాగరికత ఆనవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. భారతీయ గ్రంథాలు వాటికి సాక్ష్యాలు చూపుతున్నా, మెకాలే వారసులైన చరిత్రకారులు మనది ‘సంస్కృతి హీనమైన’ దేశంగా చిత్రీకరించారు. కాలగమనంలో అనేక నిజాలు బయట పడుతున్నాయి. వాటిని వెలుగులోకి తేవటం ఈ శీర్షిక ఉద్దేశం.

శ్రీకృష్ణుని అనతి మేరకు దేవశిల్చి విశ్వకర్మ  నిర్మించిన అద్భుత నగరం ద్వారక. పరమాత్మ నడయాడిన పరమపావన మోక్షధామం. నాటి పురాణగాథలు ప్రత్యక్ష సత్యాలని నేటి అంతరిక్ష పరిశోధనల, నిష్పాక్షిక చారిత్రక పరిశీలనలలో నిగ్గు తేలినవి. ఆ ద్వారకా నగరి విశిష్టతని పరిశీలిద్దాం!

అధునాతన నాగరికతకు ప్రాణ భిక్ష పెట్టిన ఒకానొకనాటి సనాతన సంస్కృతి ఎక్కడో సముద్రపు అట్టడుగున శిలలూ శిల్పాల రూపంలో పడివుంటే దాన్ని వెలికి తీయడం హర్షణీయం!

అదే ఐదు వేల యేళ్ల క్రితం నాటి ద్వారక!

వాల్మీకి వ్యాసాదుల పుణ్యమా అని మన కంటూ ఒక చరిత్ర ఉంది. విశ్వమంతా చాటేందుకు మనకి అనేక కావ్యాలు,పురాణ కధలున్నాయి.

కొట్టి పారేసే బుద్ధి లేనంత వరకూ, రానంత వరకూ ప్రతి మహాకావ్యం ఒక విజ్ఞాన సర్వస్వం! ఒక భూతకాల అనుభవం, ఒక వర్తమాన చైతన్యం, భవిష్యత్కాలానికి ఒక హెచ్చరిక! వీటి ఆధారాలతో మన సంస్కృతిని మరల మరల బ్రతికించు కోవాలి. ఈ దిశగా మన సంస్కృతి సంరక్షణ కోసం తమ విజ్ఞానశాస్త్రం అనుభవాన్ని జోడించిన మేధావులెం దరో మనలో ఉన్నారు.

ద్వారక మునిగిపోయింది. ఏ సముద్రమైతే దారి చూపిందో అదే సముద్రం ఉప్పొంగి ద్వారకను కబళించింది.

కలియుగం ప్రారంభం కానున్నదని కృష్ణుడు హెచ్చరిస్తూనే కన్ను మూసాడు. యాదవుల రక్షణకోసం తాను ప్రత్యేకించి నిర్మించిన ఆ మహానగరం నుంచి తక్షణం నిష్ర్కమించమని యాదవులందర్ని ఊరడించి తనువు చాలించాడు శ్రీకృష్ణుడు! మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here