శివ పూజ కు యే పువ్వులు వాడాలి? ఏమి వాడకూడదు? | Which Flowers Are Offered to Shiva Pooja

1
21100
which flowers are used for shiva pooja
which flowers are used for shiva pooja

which flowers are used for shiva pooja

1. శివ పూజకు వాడవలసిన, వాడకూడని పువ్వులు

శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా
దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా
కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా
గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా|

అని పద్మపురణాం చెబుతోంది. సాధారణంగా శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖపుష్పం, నాగలింగం పువ్వులను ఉపయోగించడం జరుగుతుంది కానీ, శివ పూజకు మొగలిపువ్వులను, తీగమల్లెపువ్వులను ఉపయోగించకూడదు.

ఇతర దేవతలకు వాడ కూడనివి

స్త్రీదేవతల పూజకు జిల్లేడుపూలను, పారిజాతాలను దుర్వారాలను వాడరు. సూర్యునిపూజకు నందివర్థనాలను, విఘ్నేశ్వరపూజకు తులసీదళాలను ఉపయోగించకూడదు.

హరిపూజకు ఉపయోగించకూడని పువ్వులు

విష్ణుపూజకు ఉమ్మెత్తుపువ్వులను, విప్పపూలు, అశోకపుష్పాలు, గోరింటపువ్వులు, వేపపువ్వులు, విష్ణుక్రాంతపూలు, వాయిలిపువ్వులు, తుమ్మపూలు, పెద్దగన్నేరుపూలు, మందారపూలు, మొగ్గమల్లె, దత్తూరపూవ్వులు, నందివర్థనాలు, అవిశ, డొమ్మడోలు పువ్వులు పనికిరావు. భాద్రపద మాసంలో మొగలిపువ్వులను పూజకు ఉపయోగించ రాదని చెప్పబడింది.

ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు ? | Why we Should Use Cow Milk for Pooja in Telugu

పూజకు ఎటువంటి పువ్వులు వినియోగించాలి ? | Which flowers should be used in Pooja in Telugu

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here