అనంత పద్మనాభుని ఖజానా నుంచి లక్ష కోట్ల బంగారం దోచేశారా…? | 266 kg gold missing from Sree Padmanabhaswamy temple in Telugu

0
8136
sri-padmanabhaswamy-temple-thiruvananthapuram_9235532_l
అనంత పద్మనాభుని ఖజానా నుంచి లక్ష కోట్ల బంగారం దోచేశారా…? | 266 kg gold missing from Sree Padmanabhaswamy temple in Telugu

కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి పేరు చెబితే లక్ష కోట్ల విలువైన బంగారు నగలు… మూడేళ్ల క్రితం…

2011 వెలుగుచూసిన పద్మనాభుని నగల ఖజానా గుర్తుకు రాకమానదు. ఐతే ఇప్పుడు దీనిపై మరో సంచలనం వెలికి వచ్చింది.

అనంత పద్మనాభుడికి చెందిన ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇవి మాయమయ్యాయని ఆయన తెలిపారు. ఈ బంగారు కుండలకు సీరియల్ నంబర్ 1 నుంచి 1988 వరకూ ఇచ్చారని..

ఇవి ప్రస్తుతం 397 మాత్రమే ఉన్నాయని నివేదికలో అయన వెల్లడించారు.

ఆలయ కమిటీల లెక్కల ప్రకారం వీటిల్లో 822 కుండలను ఆభరణాల కోసం కరిగించినట్టు ఉందని వాటిని తొలగిస్తే 1,166 బంగారు కుండలు ఉండాల్సి వుందని ఆయన తెలిపారు.

ఆలయ కమిటీ సరిగా లేదని దాన్ని తొలగించాలని సూచించారు.

Source

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here