అడిగిన వరాలిచ్చే ఆంజనేయుని పూజ! | Hanuman Pooja in Telugu

1
11605
hanuman pooja rituals
Hanuman Pooja in Telugu

 Hanuman Pooja in Telugu

1. అడిగిన వరాలిచ్చే ఆంజనేయుని పూజ

జాతక దోషాల వల్ల అనారోగ్యాలు కలిగినా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా, విద్యా ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధించాడానికైనా హనుమంతునికి మండలం(40) పాటు తోక పూజ చేయడం వలన అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. హనుమంతుని ఎన్నోరకాలుగా పూజిస్తాం. అయితే ఆ పూజలలో ఆయన వాలాగ్ర పూజ విశిష్టమైనది.

హనుమంతుని తోక పూజ ఎలా చేయాలి?

ఒక శనివారం నాడు తోకపూజను ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఆంజనేయుని పటాన్ని పూలతో అలంకరించాలి. శాస్త్రోక్తంగా పూజ చేసి స్వామి పటం / విగ్రహం లోని తోక కు ఒక గంధపు చుక్కను దిద్దాలి. హనుమత్ లాంగులాస్త్ర స్తోత్రం (శ్లోకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పఠించాలి. దగ్గర్లో ఉన్న ఆంజనేయుని ఆలయాన్ని దర్శించి స్వామికి 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా ఇంట్లోనే స్వామి పటం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. స్వామికి నైవేద్యం సమర్పించి శాస్త్రోక్తంగా పూజ ముగించాలి. నలభైరోజుల తరువాత చివరిరోజున ఉద్యాపన చెప్పుకుని, స్వామికి తమలపాకులతో, సిందూరంతో పూజ చేసి, అన్నదానం చేయాలి.  ఈ విధంగా నలభై రోజుల పాటు చేయడం వలన ఆంజనేయుని కృపకు పాత్రులవుతారు.

Related Stories

Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

Avoid Sleeping Problems in Telugu | నిద్ర పట్టట్లేదా! అయితే ఈ శ్లోకం చదవండి. వెంటనే నిద్ర వస్తుంది.

పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోందా? | Putraprapti Ashtakam

మన పురాణాలలోని అమావాస్య కథ? | story of no moon day

విజయాలను అందించే అపరాజితా దేవి! | Goddess of Victory Aparajitha Devi

నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health

 

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here