
Why We Shouldnt Pour Laundry Water on Feet
1. బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్లపై పోసుకోకూడదా?
బట్టలు ఉతికిన నీళ్ళను సాధారణంగా చాలామంది స్త్రీలు కాళ్లపై పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. దీనివలన ఆరోగ్య సమస్యలూ ఆర్థిక సమస్యలూ వచ్చే అవకాశం ఉంది.
బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్లపై ఎందుకుపోసుకోరాదు?
మనం ఎన్నో రకాల ప్రదేశాల నుంచీ తిరిగి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. ఆ ప్రదేశాల తాలూకు మంచి చెడులు బట్టల కొసలకు అంటుకుని ఉంటాయి.
అంటే మనం బయటినుంచీ వచ్చేటప్పుడు కేవలం మురికిని మాత్రమే కాదు. కొన్ని ప్రదేశాలలోని చెడుని ఇంటికి మోసుకొస్తాం.
వాటన్నింటినుంచీ విముక్తి కోసమే ఆ మాసిన బట్టలను విడిచి శుచిగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలను వేసుకుంటాం.
మరి అలాంటప్పుడు ఆ మురికితో కూడుకున్న నీటిని కాళ్లమీద పోసుకోవడం ద్వారా శుభ్రత నశిస్తుంది. అంతేకాదు శని అపరిశుభ్రమైన పాదాల కూ, విరబోసుకున్న వెంట్రుకల కొనలకూ ఆకర్షితుడవుతాడు.
కనుక ఆ బట్టలను ఉతకడం ద్వారా మనం వదిలించుకున్న శనిని, మురికినీ, చెడు ప్రభావాలనీ తిరిగి మనతోపాటే మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకున్నవాళ్లమవుతాం.
కాబట్టి బట్టలు ఉతికిన నీటిని ఎట్టిపరిస్థితులలోనూ కాళ్లపై పోసుకోరాదు.
బట్టలు ఉతికిన నీరు కాళ్లపై పోసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్లపై పోసుకోవడం వల్ల కాలి గోళ్ళలోకి, కాలిపగుళ్ళ లోకీ ఆ మురికి నీరు చేరి రకరకాల ఇన్ఫెక్షన్లను కలిగించే అవకాశాలు ఎక్కువ.
పగుళ్ళ లోనికి వెళ్ళిననీరు కొంతలో కొంతైనా శుభ్రం అవుతాయి. కానీ కాలి గోళ్ళలోకి పోయిన మురికినీరు తాలూకు చెడు ప్రభావాలు అంతా త్వరగా వదిలిపోవు.
కనుక బట్టలు ఉతికిన నీటిని కాలిపై పోసుకునే అలవాటు మానుకోవడం ఉత్తమం.
Related Posts
తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
లక్ష్మి మానస గారు శుబోదయము చాలా చక్కనివిషయాని చెప్పారు ధన్యవాదాములు