Why To Use Kajal?
Why To Use Eye liner
మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి.
ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం.
కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు!
3. కాటుక తయారీ
కాటుక తయారీలో గంధం, ఆముదాలదే ముఖ్య పాత్ర. ఈ రెండింటికీ కూడా కంటికి చలువ చేసే గుణం ఉంది. వంటింటి పొగ నుంచి కంప్యూటర్ తీక్షణత వరకూ స్త్రీలు ఎక్కడ పనిచేసినా ఈ కాటుక వారికి రక్షగా నిలుస్తుంది.
కళ్లను అలవనీయకుండా అడ్డుపడుతుంది. చాలామంది మగవారు సైతం కళ్లు మంటగా ఉన్నప్పుడు ఒక చుక్క ఆముదాన్ని కళ్లలో వేసుకుంటూ ఉంటారు.
ప్రాంతాన్ని బట్టీ, నమ్మకాలను బట్టి కాటుకను వేర్వేరు రకాలుగా తయారుచేస్తూ ఉంటారు. కొంతమంది కేవలం గంధం, ఆముదాల మసితో కాటుకను రూపొందిస్తే…
మరికొందరు కరక్కాయ, పచ్చకర్పూరం, నువ్వులనూనె వంటివి కూడా ఉపయోగిస్తారు. మరికొందరు ఔషధులను కూడా కాటుక తయారీలో చేరుస్తారు.
సంప్రదాయబద్ధంగా తయారుచేసే ఇలాంటి కాటుకలన్నీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేవే! కాకపోతే బయట బజార్లో కాటుకను కొనేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఏ కాటుకని పడితే ఆ కాటుకను వాడిపారేస్తే వాటిలో ఉండే సీసం వంటి రసాయనాల వల్ల అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ముఖ్యంగా పిల్లలకు కాటుకని పెట్టాలనుకున్నప్పుడు కాటుక తయారీలోనూ, కొనుగోలులోనూ మరింత జాగ్రత్త అవసరం! ఈ కాస్త జాగ్రత్తను తీసుకుంటే చాలు కాటుక కళ్లు ఈ లోకాన్ని మరింత కాంతిమంతం చేస్తాయి.