
What will happen if a shadow of a temple falls on a house?
1. దేవాలయానికి దగ్గరలో ఉన్న ఇంటిని ఎందుకు ఎంచుకుంటారు ?
దేవాలయానికి దగ్గరలో ఇల్లు ఉండడం వల్ల భగవంతుని స్తోత్రాలు, మంగాళాశాసనాలు ఎప్పుడూ వినబడుతుంటాయనీ ఆహ్లాదకరంగా ఉంటుందనీ చాలా మంది భావిస్తారు. కానీ నిజానికి దేవాలయానికి అతి సమీపంలో ఇల్లు కట్టుకోవడం శుభం కాదు.
దేవాలయపు నీడ పడే చోట ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు?
ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి సమీపంగా ఎందుకు కూర్చోము? ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి. దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాదు. శాస్త్ర బద్ధంగా నిర్మించబడే ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటారు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదు అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి.
ఏ ఆయలానికి ఎటువైపున ఇల్లు ఉండకూడదు?
వాస్తు ప్రకారం శివాలయానికి వైష్ణవాలయానికి వెనక వైపున ఆనుకుని ఇల్లు ఉండరాదు. అలా ఉంటే దానివల్ల కుటుంబ కలహాలు కలిగే అవకాశం ఉంది.
శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.
వైష్ణవాలయానికి అతిసమీపం లో ఉన్నట్టయితే అమ్మవారు ఆ ఇల్లు విడిచి స్వామి సన్నిధిలోనే ఉంటుంది. ఆ ఇంటిలో ధనం నిలవదు.
శివాలయానికి అతిసమీపం లో ఉన్నట్టయితే శత్రు భయం కలుగుతుంది.
శక్తి ఆలయానికి ఆనుకుని లేదా అతి సమీపం లో ఇల్లు ఉన్నట్టయితే ఆ ఇంటిలోనివరెవ్వరూ ఎక్కిరారు. అంటే ఏ విషయం లోనూ పురోగతి ఉండదు.
ఇంటికి ఉత్తరాన గానీ , వాయువ్యం లో గానీ 200 అడుగుల లోపల వినాయకుని ఆలయం ఉన్నట్టయితే ఆ ఇంటి వారికి ధన నష్టం, అవమానాలు సంభవిస్తాయి.
ఒకవేళ ఇప్పటికే దేవాలయపు నీడపడే చోట నివసిస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదించండి
how to contact you people.
this is my no:9290044978.
please send your contact details.
I have doubt about temple shadow problem.