
Mukkupudaka Significance
1. ముక్కుపుడక పెట్టుకునే ఆచారం ఎప్పటిది?
నాసాగ్రే నవ మౌక్తికం అని శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పేరు. ముక్కుపుడక ధరించే సంప్రదాయం హిందూ మతం లో అనాదినుండీ ఉంది.
ముక్కుపుడక కేవలం మనసు దోచుకునే అలంకారమే కాదు. మగువల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. భారత దేశం లో ప్రాంతాన్ని బట్టి ముక్కుపుడక ధరించే తీరులో మార్పులు ఉన్నాయి.
కానీ దాదాపు అన్ని సంస్కృతులలోనూ ముక్కు పుడక ధరించడం సర్వసాధారణం.
ముక్కుపుడక ఏ వయసు వారు ధరించాలి?
సాధారణంగా ఐదు, ఏడు, పదకొండు సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు. లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు.
వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాలలో భావిస్తారు. చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్య పరంగా మంచిది.
ముక్కుపుడక ఎన్ని రకాలు? ధరించడం వల్ల కలిగే లాభాలేమిటి?
ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది.
కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు.
ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి.
పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవి కి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది.
Related Posts
తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి!Good Thithulu
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
 
             
		
లక్ష్మీ మానస గారు శుబోదయము ధన్యవాదాములు ముక్కు పుడకంచి తెలియజేసినందుకు
tq
[…] ముక్కు పుడక ఎందుకు ధరించాలి? […]