ఎవరి గొప్ప వారిదే! | Moral story

0
1176

moral storyసింగవరానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునే వారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు ‘నేను గొప్ప.. కాదు నేనే గొప్ప’ అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి ‘కొన్ని రోజులు ఆగండి. మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని. నేను తేలుస్తాను’ అని చెప్పింది. ఒక రోజు ఆ దారివెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టుకిందకు వచ్చాడు ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని ‘నాలో నీకు ఏ భాగం ఇష్టం’ అని అడిగింది. అప్పుడు బాటసారి.. ‘నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం’ అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి.

ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ని ‘నాలో నీకిష్టమైంది ఏంటి’ అని ప్రశ్నించింది ‘నీ వేర్ల ద్వారా ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్నా….. కాబట్టి అవంటేనే నాకు ఇష్టం’ అనేసి వెళ్లాడు. మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టుకింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళ్తుండగా. ‘నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్లు అడిగింది. ‘ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కరిగించిన నీ ఆకులు, కొమ్మలంటే ఇష్టం. కానీ వేళ్లుంటేనే చెట్టుకు నీరందుతుంది. ఆకులూ కొమ్మలూ ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక, ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏభాగాలూ వేటికీ తీసిపోవు. అన్నీ సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది. మీ వల్లనే స్వచ్చమైన గాలి అందుతుంది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి’ అని చెప్పి వెళ్లిపోయాడు.

ఉత్తమ చెట్టు కథ గురుంచి మీకు తెలుసా ? | tale of best tree story in Telugu

భూదాన మహిమ (ఈరోజు కథ) | land donation Story in Telugu