
Where is the Real Human Head of Ganesha Cut Off by Lord Shiva?
2వినాయకుడి జననం (Birth Story of Lord Ganesh)
ఒక రోజు సాయంత్రం వేళ ఏకాంతంలో ఒంటికి పసుపు రాసుకుంటున్న పార్వతి దేవి, అదే పసుపు ముద్దతో ఒక బొమ్మని చేసింది. ఆ పసుపు ముద్దకే ప్రాణం పోస్తే గణేశుడు అయ్యాడు. తను స్నానికి వెల్తున్నాను ఎవరిని లోనికి అనుమతించకు అని ఆ బాల గణేశుడుని అజ్ఞాపిస్తుంది. అమ్మ ఆజ్ఞ మేరకు విఘ్ణేశ్వరుడు ఆ గుమ్మం దగ్గర ద్వార పాలకుడిగా ఉంటాడు. కొద్ది సేపటి తర్వాత శివుడు తన ఇల్లే కదా అని వేగంగా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇది గమనించిన గణేశుడు శివున్ని అడ్డుకుని “మా అమ్మ స్నానం చేస్తుంది కావున తను వచ్చే వరకు బయటనే వేచి ఉండాలి” అని చెబుతాడు. ఇది తన ఇల్లే అని, పార్వతి నా భర్య అని, నన్ను లోనికి అనుమతించాలి అని ముద్దు చేస్తు అడుగుతాడు శివుడు. అయినా వినాయకుడు ఆ మాటలు పట్టించుకోకుండా మా అమ్మ ఎవరిని లోనికి రానివద్దు అని చెప్పింది. ఎవరు వచ్చిన నేను అనుమతించను అని చెప్పాడు. శివుడు గణేశుడు పసివాడు అని ఎంతో ముద్దుగ సర్ది చెప్పినా వినడు. చివరకు భయపెట్టిన భయపడడు. గణేశుడు శివుడితో యుద్ధానికి కూడ కాలుదువ్వుతాడు. ఆ బాలుడిని చూస్తే చిన్న పిల్లాడు కాని మాటలు కోటలు దాటుతున్నాయి. బాలుడి మాటలకు కోపం వచ్చి యుద్దానికి దిగుతాడు శివుడు.
హోరా హోరిలో శివుడు తన త్రిశూలాన్ని గణేశుడుపై ప్రయోగిస్తాడు. ఆ త్రిశూలం వేగానికి గణేశుడి తల తెగి కైలసం ఆవల పడిపోతుంది. అప్పుడే పార్వతి దేవి వచ్చి తల లేని తన బిడ్డను చూసి తల్లడిల్లూతూ మొండాన్ని తన ఒడిలోకి తీసుకోని తన అల్లారు ముద్దు అయిన తన బిడ్డను చంపుతావా అని దుఃఖిస్తుంది. విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు. పార్వతిదేవిని ఎన్నో మార్గాల్లో సముదాయిస్తాడు కాని తన బాధను మాత్రం తగ్గించలేకపోతాడు. ఇక చేసేదేమిలేక భటులను పిలిచి గణేశుడి తలను తీసుకురమ్మని పంపుతాడు. కాని వారికి ఎంత వేతికిన తల దోరక్క తిరిగి కైలాసంకి వస్తారు. చివరికి బ్రహ్మ సలహాతో ఏనుగు తలను పెట్టి ప్రాణం పోస్తాడు శివుడు. అతీతమైన శక్తులను త్రీముర్తులు గణేశుడికి ఇస్తారు. అవి, తోలి పూజ గణేశుడికే అని, తనను తలుచుకున్న వారికి ఆపదలు రావు అని, ధ్యాననికి బుద్దిమంతుడికి ప్రతీకగా నిలుస్తాడు అని దేవతలు ఆశీర్వదిస్తారు. దీంతో వినాయకుడు విఘ్నాలు తోలిగించే దేవుడిగా కీర్తి ఘడించాడు. ఇక్కడి వరకు అందరికి తెలిసిన కథే. అసలు కథ కోసం తరువాతి పేజీలో చూడండి.