Kashi Yatra | కాశి వెళ్లే వారు తొమ్మిది రోజులుండి ఆ రోజుల్లో ఏం చేయాలి & ఏమి చూడాలి?

0
420
Kashi Yatra In 9 Days
How Many Days Should We Stay In Kashi

Kashi Yatra In 9 Days

1కాశీ యాత్ర తొమ్మిది రోజుల కార్యక్రమ వివరాలు:

1వ రోజు (Day 1):

1. మణి కర్ణిక ఘట్టంలో స్నానం, బ్రాహ్మణులకు దానం, కేశ ఖండనం చేయాలి.
2. మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి.
3. రుద్రాక్ష మాల ధరించి మణి కర్ణిక స్తోత్రం పఠనం చేయాలి.
4. డుండి వినాయకుని దర్శనం, 21 గరికలు, 21 కుడుములు, 21 గుంజీలు, 21 రూపాయలు సమర్పణ చేయాలి.
5. అన్నపూర్ణా దేవి, విశాలాక్షి, జ్ఞాన వాపి, సాక్షి గణపతుల దర్శనం చేసుకోవాలి.
6. రాత్రి విశ్వనాధ దర్శనం, ఫలహారం తీసుకోవాలి.
7. మహాదేవ మంత్రం 108 సార్లు జపం చేయాలి.

2వ రోజు (Day 2):

1. గంగా స్నానం, విశ్వేశ్వర, అన్నపూర్ణా దర్శనం చేసుకోవాలి.
2. మధ్యాహ్నం మణి కర్ణికా ఘట్టంలో స్నానం, తీర్ధ శ్రాద్ధం, 1000 గాయత్రీ జపం చేయాలి
3. మంత్రోపదేశంతో 1000 “శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః” జపం చేయాలి
4.మధ్యాహ్నం, సాయంత్రం విశ్వేశుని దర్శనం చేసుకోవాలి.
5. రాత్రి ఫలహారం స్వీకరించాలి.

3వ రోజు (Day 3):

1. అసీ ఘట్టంలో సంకల్ప స్నానం, సంగమేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి
2. దశాశ్వ మేధ ఘట్టంలో స్నానం, శీతలాదేవి దర్శనం చేసుకోవాలి
3. వరుణా ఘట్టంలో స్నానం, ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి
4. బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం, పంచనదీ తీర్ధ స్మరణ చేయాలి
5. బిందు మాధవ, సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి
6. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శనం చేసుకోవాలి
7. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
8. రాత్రి పాలు, పండ్లు స్వీకరించాలి.

4వ రోజు (Day 4):

1. గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
2. డుండి వినాయకుని దర్శనం చేసుకోవాలి
3. కాల భైరవుని పూజ, కాశీ క్షేత్ర రాజ్యాన్ని స్మరించి 36 సార్లు “ఓం కాశ్యైనమః” జపం చేయాలి
4. బిందు మాధవుని, గుహ, భవానీ దేవి దర్శనం చేసుకోవాలి
5. మణి కర్ణికలో మట్టి లింగ పూజ చేయాలి
6. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
7. రాత్రి పాలు, పండ్లు స్వీకరించాలి.

5వ రోజు (Day 5):

1. గంగా స్నానం, కేదారేశ్వరుని దర్శనం, రుద్రాభిషేకం చేయాలి
2. తిలా భాన్దేశ్వర, చింతా మణి గణపతి దర్శనం చేసుకోవాలి
3. దుర్గా దేవికి ఒడి బియ్యం దక్షిణ, గవ్వలమ్మ (కౌడీబాయి) పూజ చేయాలి
4. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
5. రాత్రి పాలు, పండ్లు స్వీకరించాలి.

6వ రోజు (Day 6):

1. సూర్యోదయానికి ముందు గంగా స్నానం చేయాలి
2. బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ, ఆశీర్వాదం తీసుకోవాలి.
3. వైధవ్యం రాకుండా ఉండటానికి దీవెనలు తీసుకోవాలి.
4. మూసివాయన చేటలదానం చేయాలి
5. బేసి సంఖ్యలో జనానికి వాయనదానం చేయాలి
6. వ్యాస కాశీకి చేరుకోవడం
7. వ్యాసుడు, రామ లింగేశ్వరుడు, శ్రీ శుకుల దర్శనం చేసుకోవాలి
8. కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
9. భోజనం చేయాలి
10. రాత్రి సంకీర్తన, పాలు, పండ్లు స్వీకరించాలి.

7వ రోజు (Day 7):

1. గంగా స్నానం, నిత్య పూజ చేయాలి
2. వెయ్యి గరికలు లేదా నూట ఎనిమిది గరికలు సిద్ధం చేయడం
3. ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు, నూట ఎనిమిది ఎర్ర పూలతో పూజ చేయాలి
4. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం, తాంబూలం ఇవ్వాలి.
5. డుండి వినాయకుని అర్చన చేయాలి
6. అన్నపూర్ణాలయంలో కుంకుమ పూజ చేయాలి
7. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడి బియ్యం, గాజులు సమర్పణ చేయాలి
8. విశాలాక్షికి కూడా ఇదే విధంగా పూజ చేయాలి
9. విశ్వేశునికి అభిషేకం చేయాలి
10. సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన చేయాలి
11. హారతి, తీర్ధ ప్రసాదాల స్వీకరణ చేయాలి
12. “హర సాంబ హర సాంబ” 11 సార్లు జపం చేయాలి

8వ రోజు (Day 8):

1. గంగా స్నానం, నిత్య పూజ చేయాలి
2. కాల భైరవుని దర్శనం, వడలు, పాయసం నివేదన చేయాలి
3. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి
4. కాల భైరవ స్మరణతో రోజంతా గడపడం
5. ఐదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనం, దక్షిణా, తాంబూలం ఇవ్వాలి
6. భోజనం చేయాలి
7. రాత్రి కాల భైరవ స్మరణతో నిద్ర పోవాలి

9వ రోజు (Day 9):

1. గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేయాలి
2. అన్నపూర్ణాదేవి దర్శనం, పూజ చేయాలి
3. నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి
4. జ్ఞానులైన దంపతులకు భోజనం, దక్షిణా, ఆశీర్వాదం తీసుకోవాలి
5. రాత్రి అన్నపూర్నాష్టం, నిద్ర పోవాలి

10వ రోజు (Day 10):

1. గంగా స్నానం, గంగ పూజ, సహస్రనామ పూజ చేయాలి
2. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి
3. తలిదండ్రులు, గురు దంపతుల పూజ, ఆశీర్వాదం తీసుకోవాలి
4. ఇంటికి ప్రయాణం

  • ఈ కార్యక్రమం పూర్తి చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Posts

ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే చాలు రాహు, కేతు, కుజ, సర్ప దోషమున్న వారి భాధలు తొలుగుతాయి.

Lord Shiva | శివుడి దగ్గర ఉన్న నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం వెనుక పరమార్థం ఏమిటి?

ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు | Woman Should Know These Things

బొట్టు & తిలకం పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు?! | Things to Know About Applying Tilak on Forehead

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవడమే!? | What Not To Do After Sunset?

ఈ కొత్త సంవత్సరం సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సరి! | Vastu Tips for New Year

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది! | Diwali Vastu Tips

స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra

రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?