ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళాలి? | Ideal Time to Visit Temple

5
18140
Ideal Time to Visit Temple in Telugu
Ideal Time to Visit Temple in Telugu

 వైష్ణవాలయాలని ఎప్పుడు దర్శించుకోవాలి?

ఉదయాన్నే దైవదర్శనం శుభప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే. దేవాలయాలను దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది, కోరికలు నెరవేరుతాయి. అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలను దర్శించడం వల్ల అధిక ఫలితాన్ని పొందవచ్చు. స్థితి కారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్నీ,శ్రీ రామునీ, ఆంజనేయుని ఆలయాలని లేదా ఏ వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి. నిత్య జీవనం లో మనకు ఎదురయే అనేక ఆపదలను బాపే శ్రీమన్నారాయణుని ఆ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం అత్యంత శుభస్కరం.

శివాలయాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి?

లయకారకుడు, ధ్యానమూర్తి అయిన శంకరుడిని ఆయన అనుచర గణాలనూ రాత్రివేళ లేదా సాయం సమయాలలో దర్శించాలి. పరమ శివుడు మనస్సుకు అధిపతి, జగద్గురువు. అటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తరువాత దర్శించుకోవడం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది. దీనికి కారణం చంద్ర కిరణాలు మానవుని శరీరం లో రక్తప్రసరణ పై (బి.పి.) నేరుగా ప్రభావం చూపుతాయి. చంద్రుడు ఆకాశం లో ఉండగా బుద్ధికి మనసుకూ అధిపతి అయిన శంకరుని ధ్యానించడం వల్ల చంద్ర కాంతి మన మనసుపై మంచి ప్రభావాన్ని చూపి, ఏకాగ్రత,జ్ఞాపక శక్తి, బుద్ధికుశలత పెరుగుతాయి.

అమ్మవారి ఆలయం ఎప్పుడు దర్శించుకోవాలి?

అమ్మవారి ఆలయాలను దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఉండదు. ఆమె త్రిలోకాలకూ అమ్మ కనుక అమ్మను ఏ వేళలో అయినా దర్శించవచ్చు,ధ్యానించవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here