
Fasting (Upavasam) Benefits in Telugu?
1. లంఖణం పరమౌషధం
ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. నోటితో ఏమి తీసుకున్నా అది ఉపవాసము అవదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నము గావదలి వేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమగుట అంత ఉన్నత స్ధాయికి పోలేక మధ్యలో ఆకలి అయితే క్షీర ఫలాదులను స్వీకరింతురు. “పయో బ్రహ్మణస్య వ్రతమ్” అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు
కారణాంతరములు (Alternative reasons)
స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి , భజనలలోను నిమగ్నమై ఉన్నవారికి మలమూత్రాదులు , అపానవాయువుల అంతరాయము ఉండును గనుక ఉపవాసము చేయుట ఉత్తమము. ఉపవాసము చేయుటవలన వాటినుండి కొంతవరకు లేదా పూర్తిగా బయటపడవచ్చును. ఇదే ఉపవాసము లోని అంతరార్ధము.
ఆధునిక జీవన విధానము లో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. చక్కటి ఆరోగ్యానికి ఉపవాసము దివ్యౌషధం. శరీరములోని జీర్ణ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు శుభ్రపడి ఆరోగ్యము చేకూరుతుంది.
ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము, సైన్సు చెప్పదు. ఒక పూట లంఖణం చేస్తే అన్నీ శరీరభాగాలూ ప్రభావవంతమవుతాయి. అందుకే నెలకొకసారి, వారానికొకసారి లేదా 15 రోజులకొకసారి ఉపవాసం చేయడం ఉత్తమం. ఆ రోజు అన్నం లాంటి ఘన పదార్థాలేమీ తినకుండా కేవలం ద్రవాహారం మాత్రం తీసుకోవచ్చు అంటారు. అలాగని కాఫీలు టీలు తాగకుండా చక్కగా పాలు, మజ్జిగ, కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద. నీరు సరిపడా తాగాలి.
ఉపవాసములో రకాలు (Types of Fasting)
- సంపూర్ణ ఉపవాసము : ఈ తరహా ఉపవాసము చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు.
- పానీయాలతో ఉపవాసము : ఇందులో ఘనపదార్ద ఆహారానికి బదులు మంచి నీళ్ళు , పండ్లరసాలు , టీలు , కాఫీలు , పానకము మున్నగు ద్రవరూప ఆహారం తీసుకుంటారు.
- వండని పదార్దాలలో ఉపవాసము : ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు వండని ద్రవపదార్దములతో కలిపి తీసుకుంటారు. వండిన , ఉడికించిన పదార్దాలు తీసుకోరు.
- వండిన ఆహారముతో ఉపవాసము : ఈ తరహా ఉపవాసము లో ఉడికించిన కూరగాయలు, గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుంటారు .
ఉపవాస విధానాలు (Methods of Fasting)
- ఉపవాసము ఒకరోజు నుంచి అనేక రోజులు చేయవచ్చును
- ముందు తక్కువ సమయం ఉపవాసము చేసి ఆ తర్వాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి
- భోజనము లేదా ఆహారములో కొన్ని పదార్ధాలను మినహాయించుకొని ఉపవాసం చేయుట మంచిది
- రోజులో ఒక పూట ఉపవాసము
- ఒక రోజు అంతా ఉపవాసము చేయుట
- వారాంతం ఉపవాసాలు – వారానికి ఏదో ఒకరోజు ఉపవాసము చేయుట-క్రమము తప్పకుండా చేయుట
- పండగ రోజులు, పుణ్యదినాలలో ఉపవాసము చేయుట – ఇది ఒక క్రమ పద్దతి లో ఉండదు
ఉపయోగాలు (Benefits)
-
- లంకణం పరమౌషధం కాబట్టి జీర్ణాశయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వడం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడం..
- అన్నిటికంటే ముఖ్యమైనది ఇంద్రియాలపై పట్టు
- చెడు అలవాట్లనుండి దూరం కాగలము.
- దైవ భక్తి పెంపొందును.
- సహనం ఓపిక పెంపొందుట
- అతిగా భుజించడాన్ని తగ్గించి, జీర్ణశక్తి పెంపొందును
- ఉపవాస కాలములో శరీరము స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది
- జీర్ణ వ్యవస్థ శుభ్రపడి జీర్ణక్రియ మెరుగు పడుటుంది
- రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.
Related Posts
Benefits of Shivaratri Fasting? | శివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది?
ఉపవాసము వలన కలిగే లాభాలేమిటో మీకు తెలుసా? | Fasting (Upavasam) Benefits in Telugu?
Why Jagaran on Shivaratri? | శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి? మరునాడు నిద్రపోకూడదా?
Mohini Ekadashi 2025 | మోహినీ ఏకాదశి 2025 విశిష్ఠత, కథ, శుభ సమయం & పూజా విధానం.
Chala baga chypyru
Chala bagundhi sir manchiga vivarincharu
Chala vivaramuga charu sir