సూర్య గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటి?

0
14180
What is solar eclipse How does it happen
సూర్యగ్రహణం అంటే ఏమిటి ? ఎలా సంభవిస్తుంది ? | What is solar eclipse how does it happen (Telugu)

What is Solar Eclipse? How Does it Happen (Telugu)

2. సూర్య గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటి? (What are the Do’s and Don’ts on Solar Eclipse Day?)

చేయవలసినవి:

గ్రహణానికి ముందుగానే స్నానం ఆచరించాలి. నిలువ ఉంచిన భోజన పదార్థాలపై, ఇతర దినుసులపై  దర్భలను ఉంచాలి. గ్రహణ కాలానికి 12 గంటల ముందే భోజనం చేయాలి. ఆరోగ్యం సరిగా లేని వారు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు గ్రహణానికి గంట ముందైనా భోజనం ముగించాలి.

గ్రహణ కాలం లో చేసే జప, హోమ, దానాలన్నీ అత్యధిక ఫలితాన్నిస్తాయి. కనుక గ్రహణ సమయం లో తప్పకుండా భగవంతుని ధ్యానించాలి. ఈ గ్రహణ సమయం లో మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల  అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. గాయత్రిని ధ్యానించడం వలన వాక్కు కు బలం ఏర్పడుతుంది. తాంత్రికులు ఈ గ్రహణ కాలాన్ని ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించారు. ఈ సమయం లో వశీకరణాది విద్యలను సాధన చేస్తే అవి సులభంగా పట్టుబడతాయని వారి నమ్మకం.  వైదికులు, సాత్వికులు ఈ గ్రహణ కాలం లో జపాలనూ, హోమాలను చేస్తారు. గ్రహణ కాలం లో చేసే దానాల వలన జాతక దోషాలు తొలగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. గ్రహణం విడిచిన తరువాత పుణ్యనదుల్లో స్నానమాచరించినా, ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్నానమాచరించినా అక్షయ పుణ్యం అంటే ఎన్నటికీ తరగని పుణ్యం లభిస్తుంది.  గర్భిణీ స్త్రీలు గర్భరక్షా స్తోత్రం పఠించాలి. క్లిష్టమైన మంత్రాలను పఠించలేనివారు, మంత్రోపదేశం లేనివారు ‘ఓం నమః శివాయ’ అనే శివ పంచాక్షరిని కానీ, ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరిని గానీ పఠించాలి. ఈగ్రహణ సమయం లో మౌనాన్ని పాటించడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తరువాత తప్పక స్నానమాచరించాలి. గ్రహణ కాలం ముగిసిన తరువాత ఇంటిని శుద్ధి చేయాలి.-

 చేయకూడనివి:

  • గ్రహణ సమయం లో సూర్యుని నేరుగా చూసే ప్రయత్నం చేయకూడదు.
  • ఆ సమయం లో బైటికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. అతినీల లోహిత కిరణాలవలన తీవ్రమైన ఆరోగ్య హాని కలుగుతుంది.
  • గ్రహణ సమయం లో భోజనం నిషిద్ధం.
  • ముందురోజు వండిన పదార్థాలను ఉంచరాదు.
  • ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బైటికి రాకూడదు. గర్భస్త శిశువుపై అతి నీలలోహిత కిరణాల  విష ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం హిందూ సంప్రదాయానికి సంబంధించినది కాదు. సశాస్త్రీయంగా నిరూపించినది. అశ్రద్ధ చేయరాదు.
  • గ్రహణ సమయం లో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థ, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కనుక ఆ సమయం లో ముఖ్యమైన పనులు తలపెట్టరాదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోరాదు.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here