
What is Adhika Masam?!
3అధిక మాసంలో చేయాల్సిన పనులు (Things To Ddo in Adhika Masam)
1. దేవుడిని పూజించడం, వ్రతాలు, పితృ ఆరాధన, అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన మీ కుటుంబసభ్యలకు మంచి ఫలితాలు వస్తాయి. అధిక మాసానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మహావిష్ణువుకు చాలా ప్రియతకరమైన మాసం అధిక మాసముగా పురాణాల్లో చెప్పబడినది. మహావిష్ణువు అధికమాసాని “పురుషోత్తమ మాసం” అని కూడా అంటారు.
2. విష్ణుమూర్తి అధికమాస గొప్పతనాన్ని గురించి చెబుతూ ఈ మాసంలో చేసే పనులులో అధికంగా మంచి ఫలితాలు వస్తాయని అందుకే అధిక మాసం అని పేరు వచ్చింది.
3. అందువలన అధిక మాసంలో విష్ణుమూర్తిని పూజించడం, విష్ణు సహస్ర నామాలు పఠించడం చాల విశిష్టం. ఏకాదశి రోజు ఉపవాసము, వ్రతాలు, దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసములతో పోలిస్తే అధికమైన మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
4. ఈ మాసంలో మూగజీవాలకు ఆహారాన్ని పెట్టడం, దాన ధర్మాలు చేయడం వల్ల అధికమైన ఫలితాలు లభిస్తాయి.
5. పురాణాలు ప్రకారం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి అధికమాసం గురించి మహావిష్ణువును అడగగా మహావిష్ణువు ఈ అధిక మాసంలో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు, జప హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి అధిక ఫలితాలు వస్తాయని చెప్పారు.
6. అధిక మాసంలో మంచి పనులు చేయకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని చెబుతున్నారు .అధికమాసంలో శుక్ల పక్షమునందు గాని, కృష్ణపక్షమునందు అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున కనీసము ఈ పుణ్యకార్యాలు చేయడం వలన వీరికి అధిక మాస పుణ్య ఫలము లభిస్తాయి అని విష్ణుమూర్తి శ్రీమహా లక్ష్మికి చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.