
Benefits of Abhishekam during the Lingodbhavam.
1. లింగోద్భవ కాలం అంటే ఏమిటి..?
శివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపాన్ని ధరించిన సమయాన్నే లింగోద్భవకాలం అంటారు. సముద్ర మథనం తరువాత శ్రీ మహా విష్ణువూ బ్రహ్మదేవుడూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము ఘర్షణ పడుతున్నప్పుడు వారి కారణంగా మరో ప్రళయం సంభవించకుండా మహాదేవుడు లింగరూపాన్ని పొంది ఆద్యంతాలను కనుగొనమన్నాడు. ఆద్యంతాలు లేని లింగ రూపం ముందు విష్ణువు, బ్రహ్మ దేవుడూ ఊడిపోయారు. గర్వాన్ని విడిచిపెట్టారు. ఆ నాడు శివుడు లింగరూపం లో మొదటి సారిగా దర్శనమిచ్చిన కారణంగా మాఘ మాసం లో కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 11 గంటల తరువాతి కాలాన్ని లింగోద్భవకాలం అంటారు.
లింగోద్భవకాలం లో అభిషేకం చేయడం వలన కలిగే లాభాలు..
మహాదేవుడు సర్వప్రాణులలోనూ ఆత్మ రూపంగా నిలిచి ఉంటాడు. అటువంటి స్వామి మహా శివరాత్రి నాడు పార్థివ లింగంగా దర్శనమిస్తాడు. శివరాత్రినాడు లింగోద్భవకాలం లో బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం కలుగుతుంది. శివరాత్రినాడు అన్ని పుణ్యనదులు బిల్వ మూలం లో ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకని లింగోద్భవకాలం లో బిల్వ పత్రాలతో పూజించడం, అభిషేకించడం అత్యంత లాభదాయకం.
Related Stories
Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.
ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి | Story of Twarita Devi in Telugu
సర్పదోష హారిణి మానసాదేవి..! Goddess saves From Sarpadosham in Telugu
నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health
విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి | Quick Vastu remedy for money and abundance