
Nine Ways Of Devotions in Telugu
9. సఖ్యము
భగవంతుడు అంటే రాయో,రప్పో కాదని…విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని, ఆయన్ని తండ్రిగానో, తల్లిగానో, కొడుకుగానో, ప్రియుడిగానో, తాతగానో, మనింట్లో పెద్దవాడిగా గుర్తించి, మనం ఏమి తిన్నా, ఏమి తాగినా ఆయనకి సమర్పించాలి. మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ, ప్రేమ ఆయనపట్ల చూపిస్తూ ఆయనకి దగ్గరవ్వాలి. ఒకసారి బంధం అంటూ ఏర్పడితే మనం అయన్ని ఒదిలిపెట్టినా ఆయన మనల్ని ఒదలడు.ఇక్కడి వరకూ వచ్చిన భక్తులకి రాయిలో కూడా చైతన్యం కనిపిస్తుంది. మనిషికి చిట్టచివరి బంధమే గురువు. మనుషులకి భగవంతుడితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం గురువుల సన్నిధిలోనే కలుగుతుంది. ఎందుకంటే గురువే భగవంతుడు, భగవంతుడే గురువు కాబట్టి. నిరాకారుడైన ఈశ్వరుడు సాకార రూపంగా రావడమే గురువు అవడం.
Promoted Content