
Nine Ways Of Devotions in Telugu
7. వందనము
ప్రతి పనిలోనూ..మన ప్రతి కదలికలోను ఆయన మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉన్నారో గుర్తెరిగి ఆయనపట్ల కృతఙ్ఞతా భావం కలిగివుండటం తినే అన్నం..తాగే నీరు…పీల్చే గాలి అన్నీ ఆయనవే….ఉద్యోగం రాకున్నా, ఉన్నతి కోసం ఇలా ప్రతిదానికి ఆయన్ని ప్రార్థిస్తాం…అన్నీ ఇచ్చేది ఆయనే కాబట్టి వందనం అంటే నమస్కరించటం…ఉన్నతమైన వారికి మన శిరస్సు వంచి నమస్కరిస్తాం..శిరస్సు వంచటం అంటే పెద్దల గొప్పతనాన్ని గుర్తించి మన అహాన్ని ఒదలి వారి పట్ల వినయ, విధేయతలు ప్రకటించటం….ఈ వినయ, విధేయతలు వారి సమక్షంలోనే కాదు సుమా..వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనం అదే గౌరవభావాన్ని ప్రదర్శిస్తాం…అదేవిధంగా భగవంతుడి గొప్పతనాన్ని, ఆయన సమస్త జీవులలోను ఉన్నారని గుర్తించి సకల జీవరాసుల పట్ల కరుణ, దయ, ఇతరులతో సోదరభావం కలిగివుండటమే అసలైన వందన సమర్పణ. కేవలం గుడిలో విగ్రహం ముందు మాత్రమే కాకుండా..మనం ఉన్న ప్రతి చోటా, మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ జీవించి ఉన్న ప్రతి జీవిలోనూ… భగవంతుడున్నాడని గమనించి మన ప్రవర్తనని సక్రమంగా మలచుకోవాలి.