Veera Ganapathi for Overcoming Fears in Telugu | ధైర్య సంపదలను ప్రసాదించే వీరగణపతి

0
18131
vira ganapthi god to overcome fear
Veera Ganapathi

About Veera Ganapathi for Overcoming Fears in Telugu

1. వీర గణపతి ఎవరు?

మహా గణపతి 32 రూపాలలో నాలుగవ రూపం వీర గణపతి. ఆయన రూపం అత్యంత శక్తిమంతంగా, రక్తవర్ణంతో ప్రకాశిస్తుంది. వీర గణపతికి పదహారు చేతులు ఉంటాయి. ఆ చేతులలో ధనుస్సు, బాణాలు, చక్రం, త్రిశూలం, బేతాళం, పరశు, ఖడ్గం, గదా, పాశం వంటి ఆయుధాలను ధరించి ఉంటారు. ఆయన రూపం పంచమహాభూతాలలో అగ్ని తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అగ్ని సాన్నిధ్యంతో ఆయన రూపం శక్తి, ధైర్యం, సాహసానికి చిహ్నంగా కనిపిస్తుంది.

వీర గణపతిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు

వీర గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి శత్రుబాధలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తీరిపోతాయి. విశేషమైన ధనసంపద, విజయమార్గం, మనోబలాన్ని పొందుతారు. భయాలు దూరమై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆయన అనుగ్రహంతో కుటుంబ కల్యాణం, శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి.

వీర గణపతిని ఎలా ధ్యానించాలి?

ప్రతి ఉదయం శుచిగా స్నానం చేసి, స్వచ్ఛమైన వస్త్రాలను ధరించి, వినాయకుని ప్రతిమ ముందు దీపారాధన చేయాలి. పుష్పాలు, పండ్లు సమర్పించి శ్రద్ధతో నమస్కరించాలి. అనంతరం వీర గణపతి ధ్యాన శ్లోకాన్ని రోజుకు ఐదుసార్లు పఠించాలి. ఏ పనిని ప్రారంభించే ముందు ఆయనను ధ్యానించడం ద్వారా ఆ కార్యం సఫలమవుతుంది. ఈ విధంగా సత్య నిష్టతో, భక్తితో ధ్యానం చేస్తే శక్తి, ఐశ్వర్యం, అభయమానంగా జీవితం సాగిస్తుంది.

వీర గణపతి ధ్యానం 

బేతాళశక్తి శర కార్ముక ఖేట ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ పాశ హస్తాన్|

శూలాంచ కుంత పరశుధ్వజ ముద్వాహస్తం వీరంగణేశమరుణం సతతం స్మరామి ||

 

అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా ? మీకోసమే ఈ పరిష్కారం! | Taruna Ganapathi Ghyana in Telugu

వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi

Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam in Telugu | శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం

Gakara Sri Ganapathi Sahasranama Stotram in Telugu | గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం

Santhana Ganapathi Stotram in Telugu | సంతాన గణపతి స్తోత్రం

Sri Ganapathi Geeta in Telugu | శ్రీ గణపతి గీతా

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here