
History of vargal vidya saraswathi temple in Telugu
వేద విద్యల నిలయం వర్గల్ విద్యాసరస్వతీ ఆలయం..!
భారత దేశం లో సరస్వతీ ఆలయాలు చాలా అరుదు. అటువంటి అరుదైన సరస్వతీ ఆలయాలలో వర్గల్ విద్యా సరస్వతీ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం , శనేశ్వరాలయం చాలా ప్రసిద్ధిచెందినవి. హైదరాబాదుకు 48 కి.మీ ల దూరం లో మెదక్ జిల్లాలో గల వర్గల్ లో విద్యా సరస్వతీ ఆలయం ఉంది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసిస్తున్నారు. నిరంతర వేద ఘోషలతో అలరారే ఈ వర్గల్ విద్యా సరస్వతీ ఆలయాన్ని నిర్మించడం యామవరం చంద్రశేఖర శర్మ అనే ఒక జ్యోతిష పండితుని ఆలోచన ఆయన సరస్వతీ ఉపాసకులు కూడా. ఇక్కడ నిత్యం వందమందికైనా అన్నదానం జరుగుతుంది.
ఈ ఆలయం ప్రస్తుతం శృంగేరీ పీఠ పర్యవేక్షణలో ఉంది.