TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్లు రిలీజ్, బుక్ చేస్కోండి
వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకునే వారికి శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈ నెల 22న విడుదల చేయనుంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో దీనిపై ప్రకటన చేశారు. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ అవకాశం పొందాలి అంటే.. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయల విరాళం ఇవ్వాలి. దీంతో పాటు 300 రూపాయల దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుందని టీటీడీ తెలిపింది.
2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
ఈ సారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.
రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు.
Related Posts
https://hariome.com/2023-festival-calendar/
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?