C

గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu
3. పూజా విధానం:-
గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడవాలి.
గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్ర నామం జపిస్తూ కుంకుంతో గాని, హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి.
గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని, దీపావళి రోజు గాని, వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని, మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు.
పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని, బీరువాలో గాని ఉంచి, మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు.
గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.
శ్రీ సుఖన్య గారు నమస్కారము శుబోదయము గోమతి చక్ర్రాలు గురించి చక్క్ గా చెప్పారు ధన్యవాదాములు