
7. స్త్రీల స్వప్న దోష నివారణకు
బహిష్టు స్నానం తరువాత పురుషుడితో సంబోగించినట్టు స్వప్నం వస్తే ఆ స్త్రీకి మర్మావయవాలు బలహీనపడి జీర్ణశక్తి క్షీణించి పొతుంది. నడుము పట్టు తప్పి పొతుంది. మలబద్దకం కలుగుతుంది. వాయువు ఉదరంలో ప్రవేశిస్తుంది. దానివల్ల మిధ్యాగర్భం వచ్చేలా చేస్తుంది . అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించాలి.
అశోకచెట్టు పూలు , గులాబిరెక్కలు , నాగకేసరాలు ఆరేపువ్వు , పొంగించిన పటిక పొడి, శతావరి చూర్ణం , దొరగా వేయించిన సోంపు గింజలపొడి సమాన బాగాలుగా కలిపి పలచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మొత్తం చూర్ణం నకు సమంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి .
పూటకి అరచెంచా పొడి మోతాదుగా రెండుపూటలా చల్లని నీటితో సేవిస్తూ ఉంటే స్వప్నదోషం వల్ల స్త్రీలకు కలిగిన సకల అనారోగ్యాలు అంతరించిపోతాయి.
Promoted Content







