
10. సంతాన ప్రాప్తికి – అశోక రసాయనం
అశోకచెట్టు పై బెరడు 5 కిలొల మోతాదుగా తెచ్చి కడిగి నలగ్గొట్టి దానికి 12 రెట్లు నీటిలో వేసి ఒకరోజు నానబెట్టి తరువాత నాలుగోవంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి.
తరువాత వడబోసి అందులో పాతబెల్లం పది కిలొలు , కరక్కాయ బెరడు పొడి , తానికాయ బెరడు పొడి , ఉశిరిక బెరడు పొడి, మాని పసుపు, నల్ల జీలకర్ర పొడి , తుంగ గడ్డల పొడి, శొంటి పొడి , ఎర్రచందనం పొడి, తెల్లజీలకర్ర పొడి, అడ్డసరపు ఆకుల పొడి, మామిడి జీడి పొడి, కలువరేకుల పొడి, ఒక్కొటి 50 గ్రా చొప్పున కలిపి ఆరేపువ్వుల పొడి ముప్పావు కిలొ అందులో వేసి కుండపైన మూకుడు పెట్టి గాలి పోకుండా మట్టి బట్టతో సంధి బంధనం చేసి నెలరోజులు నిలువ ఉంచాలి.
తరువాత తీసి పై తేటనీరు వడపోసుకోవాలి . ఇదే అశోక రసాయనం .పూటకు 20 గ్రా మోతాదు గా ఈ రసాయనాన్ని సేవిస్తూ ఉంటే స్త్రీల సమస్త యోని రోగాలు , గర్భారోగాలు, బహిష్టు రోగాలు హరించి సంతానప్రాప్తి కలుగుతుంది.







