నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu

0
6539
Types of namaskaras
నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu

Types of Namaskar in Telugu

నమస్కారము చేయడం అనేది శిష్టాచారం. ఇది నాల్గు విధాలు.

  1. సాష్టాంగ నమస్కారం,
  2. దండ ప్రణామం,
  3. పంచాంగ నమస్కారం,
  4. అంజలి నమస్కారం.
Next

5. మూర్ఖాణాం చైకపాణినా

అనగా ఏకహస్త నమస్కారాలు మూర్ఖులు చేయునది. పాశ్చాత్యులు కరచాలనం చేస్తారు. ఏకహస్త్ర నమస్కారం సైన్యంలో కనపడుతుంది. ముసల్మానులు అరచేతిని గడ్డము వరకు తెచ్చి ఆదాబ్ అని గానీ, సలామాలేకుం అని గాని అంటారు. ఈ విధంగా ముందు సలాం చేసి తరువాత మాట్లాడతారు. ఇదివారి నియమం.

ఔత్తరాహికులు అంజలి నమస్కారంకాని, ఒక చేతితో పాదాభివందనంగాని చేస్తారు. దాక్షిణాత్యులలో ఎక్కువగా తెలంగాణా ప్రాంతీయులు అంజలి నమస్కారం చేస్తారు. వీరు కూడా ముందు నమస్కారం చేసి మాట్లాడతారు. నమస్కారం చేసే అలవాటు గలవారికిని, పెద్ద వారిని సేవించే వారికిని ఆయువు, జ్ఞానం, కీర్తి బలం అను నాలుగు వృద్ధి పొందును. మనుస్మృతి

అభివాదన శీలస్య నిత్యం వృద్ధపసేవినః

చత్వారి తస్య వర్ధంతే హ్యాయుః ప్రజ్ఞా యశో బలం||

యోన వేత్త్యభివాదస్య విప్రః ప్రత్యభివాదనం

నాభివాద్య స్స విదుషా యథా శూద్ర స్తథైవ సః ||

కావున బుద్ధిమంతుడ వానికి నమస్కరించరాదు.నమస్కరించిన వానికి తిరిగి నమస్కరించని వాడు శ్మశానములో రాబందులు, గ్రద్దలు నివసించే చెట్టుగా పుట్టను.

అభివాద కృతే యస్తు తం విప్రం నాభివాదయత్ |

శశానే జాయతే వక్షః కంకగృద్రోపపసేవితః ||

ఈ నియమం పరస్పరాభివందనార్హుల విషయం. జ్ఞాన వయోనుష్టాన వృద్దులు చిన్నవారికి నమస్కరించినచో చిన్న వారికి ఆయువు క్షీణిస్తుంది. వారినుండి ఆశీస్సులను ఆకాంక్షించవలెను గాని ప్రత్యభివాదం ఆశించరాదు.

 

—రంగాచార్య

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here